YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నేడే టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు పూర్తి ఐన ఏర్పాట్లు వేదిక నుంచి ఎన్నికల సమరశంఖం పూరించనున్న సీఎం కేసీఆర్

 నేడే టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు   పూర్తి ఐన ఏర్పాట్లు   వేదిక నుంచి ఎన్నికల సమరశంఖం పూరించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 17వ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల27న హైదరాబాద్ శివారు కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో ప్లీనరీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్లీనరీ వేదిక నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 119నియోజకవర్గాల నుంచి దాదాపు 13వేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ కోసం హైదరాబాద్ గులాబీమయమైంది. పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ నగరం శివార్లలో పెద్దఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. ప్రభు త్వ పథకాలను తెలియజేస్తూ హోర్డింగులు నెలకొల్పారు. మెట్రో పిల్లర్లపై కేసీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. వీటిపై.. తెలంగాణలో గుడిసె గుడిసెనా గులాబీ జెండా-పేదలకు అదే అండ. నిరంతర విద్యుత్‌తో పల్లెపల్లెన వెలుగు జిలుగులు, తెలంగాణ కల నెరవేర్చిన నాయకుడు-బంగారు తెలంగాణను నిర్మిస్తున్న సేవకుడు, మన స్వప్నం-మన లక్ష్యం బం గారు తెలంగాణ.. వంటి నినాదాలతో నగరాన్ని గులా బీ వర్ణంగా మార్చారు. ప్లీనరీ ప్రాంగణంలో చివరి ప్రతినిధికి కూడా వేదికపై ఉన్నవారు, ప్రసంగించేవారు కనపడేలా దాదాపు పది ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నారు. వేసవిదృష్ట్యా లక్ష చల్ల ప్యాకెట్లు, అంబలి, చల్లటి మంచినీటిని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రాంగణం చల్లగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. మరోవైపు ప్రతినిధులకు సేవలందించేందుకు దాదాపు రెండువేల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో అత్యధికులు టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నుంచే ఉండటం విశేషం. మేడ్చల్ జిల్లా నుంచి కూడా గణనీయ సంఖ్యలో వలంటీర్లుగా వచ్చారు. వీరికి గత రెండురోజులుగా సభా ప్రాంగణం సమీపంలోనే శిక్షణనిస్తున్నారు. వారి శిక్షణను డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తోపాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్ పర్యవేక్షిస్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించే అవకాశముంది. జాతీయ రాజకీయాలు, వ్యవసాయం, సంక్షేమం, పరిపాలన సంస్కరణలు, మైనార్టీ సంక్షేమం, మౌలిక సదుపాయాలు.. ఈ ఆరు ప్రధాన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ప్రతినిధులు చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఎన్నికల ముందు జరిగే పార్టీ ముఖ్య ప్రతినిధుల సమావేశం కావటంతో రాబోయే ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసే దిశగా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తున్నది.ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 12రకాల పాస్‌లను సిద్ధంచేశారు. పాస్ పైభాగంలోని తెలంగాణ పటంలో సీఎం కేసీఆర్ ఫొటో, ఆకుపచ్చని పొలాలు, లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఫొటోను, తెలంగాణ తల్లిని ముద్రించారు. కింది భాగంలో ఎగురుతున్న టీఆర్‌ఎస్ జెండా కనిపించేలా ఏర్పాటుచేశారు. కుడివైపు ప్రతినిధుల పేర్లు, హోదా ఉంటాయి. నమోదు సమయంలో వీటిని అందిస్తారు. పార్టీ ప్రతినిధులకు అందించే పాస్‌లను గులాబీ రంగులో ముద్రించారు. వీవీఐపీ పాస్‌లను ఆకుపచ్చ రంగులో, ఎన్నారైలకు ముదురు గోధుమరంగులో వీఐపీలకు కాషాయ రంగులో మీడియా ప్రతినిధుల కోసం నీలంరంగులో సాంస్కృతిక బృం దానికి పసుపు కాషాయం రంగులో పాస్‌లను, వలంటీర్ల కోసం నాలుగరకాల పాస్‌లను ముద్రించారు.ప్లీనరీలో పాల్గొనేందుకు 24 దేశాల నుంచి సుమారు 125మంది పార్టీ ప్రతినిధులు టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల సారథ్యంలో హైదరాబాద్ చేరుకున్నారు. గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళ్లు అర్పించారు. అక్కడి నుంచి ప్లీనరీ జరిగే కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు.

Related Posts