తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించి కె పి కెనాల్, రామాపురం, ఎండి పుత్తూరు మరియు కైలాసగిరి రిజర్వాయర్లు ను నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ గిరీష శుక్రవారం పరిశీలించి వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక ను సిద్ధం చేశారు.
నెల్లూరు జిల్లా కండలేరు నుండి పూండి మీదగాశ్రీకాళహస్తి కె పి కెనాల్, రామాపురం, ఎండి పుత్తూరు నుండి మంగళం పంప్ హౌస్ నుండి తిరుపతికి వస్తున్న త్రాగునీరు పైపులైన్లు పరిశీలించాలని,వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు.
కైలాసగిరి వద్ద ఉన్న రామాపురం వద్ద నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా నగరపాలక సంస్థ సరిపడేంత విద్యుత్ ఉత్పత్తి అవుతున్న వాటిని పరిశీలించారు. ముఖ్యంగా నీటి పైన తెలియాడే విధంగా కేరళలో గతంలో ఏర్పాటు చేయడం, నీటి పైన తెలియాడే ప్యానల్ వల్ల నీరు కూడా ఆవిరి కాకుండా ఉంటుందన్నారు, తద్వారా నగరానికి నీటి కొరత తగ్గే అవకాశం ఉండదన్నారు మరియు నగరపాలక సంస్థ విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని తెలియజేశారు. కె పి కెనాల్ నుండి తిరుపతి వరకు ప్రతి పైపులైన్లు పరిశీలించాలని, వేసవిలో త్రాగునీరు కు ఎలాంటి ఇబ్బంది కలక్కుండా ముందస్తు చర్యల్లో భాగంగా పైప్ లైన్ పరిశీలించి మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టి త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట యస్.ఈ.మెహన్,యం.ఈ. చంద్రశేఖర్, డి.ఈలు శ్రీధర్,విజయ్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఏ.ఈ. నరేంద్ర, ఎయికాం బాలాజీ తదితరులున్నారు.