కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం జరిగిన భారత్ బందులో భాగంగా నంద్యాల పట్టణంలో ఉదయం నుండి ఆర్టీసీ బస్టాండ్ నందు బందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి ఎన్.శంకర్ సిపిఎం పట్టణ కార్యదర్శి కే ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ప్రైవేటీకరణ విధానానికి స్వస్తి పలకాలని పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ మరియు నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని ప్రభుత్వ రంగ పరిశ్రమలు కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్మ ఉపసంహరించుకోవాలని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే కోట్లాదిమంది రైతుల ప్రయోజనాలను కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే మూడు నూతన సాగు నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతులను తమ సొంత భూములు వ్యవసాయ కూలీలుగా మార్చి నల్ల చట్టాలను రద్దు చేయాలని భవిష్యత్తులో ఆహార భద్రత పెను ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కావున తక్షణమే ఈ మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని గత నాలుగు నెలలుగా దేశ రాజధానిలో మొక్కవోని దీక్షతో ఆందోళనలు చేస్తున్నప్పటికీ దాదాపు 300 మంది రైతులు ఈ ఆందోళనలో బలే అయినప్పటికీ నరేంద్రమోడీకి చీమకుట్టినట్టు కూడా లేదని నాయకులు అన్నారు. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 32 మంది యువకులు బలి దానం వల్ల సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వం వన్ కార్పొరేట్ శక్తులకు ప్రైవేటీకరించడం డానికి నిర్ణయించడం సరైనది కాదని తక్షణమే ఈ ఆలోచన విరమించుకోవాలని విశాఖ ఉక్కు కర్మాగారానికి గనుల కేటాయించి పరిశ్రమల పబ్లిక్ రంగంలో నిర్వహించాలని లక్షలాదిమంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలను దుర్భరం చేయవద్దని నాయకులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. మరొకవైపు కరోనా లాక్ డౌన్ కారణంగా ఉత్పత్తి ఉపాధి కల్పన దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి సామాన్య ప్రజలపై పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్వంటి వాటి ధరలు విపరీతంగా పెంచి నిత్యావసర సరుకులు పెరగడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఇలాంటి కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి విమానయాన బొగ్గు గనులు రక్షణ రంగాలను ప్రవేటు శక్తులకు కారుచౌకగా ఎటువంటి కేంద్ర ప్రభుత్వ అ ప్రైవేటీకరణ నిరంకుశ విధానాలను విడనాడాలని లేనిచో భవిష్యత్తులో మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు ప్రతిఘటన పోరాటాలు తప్పవని నాయకులు హెచ్చరించారు ఈ బంద్ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి డివిజన్ కార్యదర్శి బాల వెంకట్. ఐఎఫ్టియు నాయకులు చౌడప్ప. ఇర్ఫాన్. సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు. ఏ ఐ ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు ఉరుకుంద రావు పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఎన్ డి రఫీ. అఖిల్. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు షేక్ నూర్ భాషా. సిఐటియు కార్యదర్శి కె ఎండి గౌస్. సిపిఎం పట్టణ కార్యదర్శి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్. డి శ్రీనివాసులు. ఐఎఫ్టియు నాయకులు కిరణ్ సుభాన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనుంజయ డివైఎఫ్ఐ నాయకులు శివ. తదితరులు పాల్గొన్నారు.