రాజమండ్రి
నిరుపేదలు, ఆకలితో అలమటించేవారికి ది యూనిక్ ముస్లిం సంక్షేమ సంఘం తుమ్వా ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ పేర్కొన్నారు. లాక్డౌన్ సమ యం నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద చేపడుతున్న ఒకపూట నిత్య అన్నదాన కార్యక్రమం 300 రోజులైన సందర్భంగా 200 మంది నిరుపేదలకు అన్నదానం, 50 మందికి నూతన వస్త్రాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా తుమ్వా ఆధ్వర్యంలో వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం తాను సైతం తుమ్వాకు విరాళాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ఎండీ ఖాదర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి ఎండీ నజీరుద్దీన్, సంక్షేమ కార్యదర్శి షేక్ సుబాన్ తదితరులు పాల్గొన్నారు.