నాగర్ కర్నూలు
అడవి బిడ్డలు ఫై ఫారెస్ట్ అధికారులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఆటవీ ఉత్పత్తులను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వారిపై కనికరం చూపకుండా తమ ఇష్టానుసారంగా చితకబాదారు. అడవిలో లభించే ఇప్పపువ్వు కోసం అడవికి వెళ్ళిన గిరిజనులపై అధికారులు దాడి చేయడంతో ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పపువ్వు కోసం ఆదివాసీ లంబాడాలు అడవికి వెళ్లగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని వారిని తీవ్రంగా కొట్టడంతో పది మందికి పైగా గాయాలయ్యాయి. వీరిని మన్ననూర్ బేస్ క్యాంప్ లో బంధించడంతో. విషయం తెలుసుకున్న గిరిజనులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. తమ గిరిజనులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి అటవీశాఖ సిబ్బంది తమను వేధిస్తున్నారని గిరిజనలు వాపోతున్నారు. అడవిలో దొరికే ఇప్పపువ్వు కోసం తాము వెళితే అటవీశాఖ అధికారులు అకారణంగా తమను గాయపరిచారని బాధితులు వాపోతున్నారు... వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు