విశాఖపట్నం
స్టీల్ సిటీ విశాఖలో కరోనా విజృంభి స్తోంది. రోజు రోజుకూ వందలా ది కరోనా కేసులు నమోదు అవుతు న్నాయి. సెకండ్ వేవ్ ముప్పు ముంచు కొస్తుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.. మరోవైపు ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జనాలు సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించేలా అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు శానిటైజేషన్ చేస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో 12 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 700 మందికి వైద్యసిబ్బంది నిన్న, ఈరోజు కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 12 మందికి కొవిడ్ సోకింది. తాజాగా కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రేపటి నుంచి జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ పరీక్షలను అధికా రులు వాయిదా వేశారు. యూనివర్సిటీతో పాటు అనుబంధ కాలేజీల్లో వాయిదా పడిన పరీక్షల తేదీల షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.