YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్

విజయవాడ, మార్చి 27, 
ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ.. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడంతోపాటు, వాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలన్నారు.కేంద్రం ఈ నెల 23న విడుదల చేసిన మార్గదర్శకాలను రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్నారు. ‘టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌’ పద్ధతిని అన్ని జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. కరోనా నిర్ధారణ కోసం కచ్చితంగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులే చేస్తారు. వైరస్‌ నివారణకు, చైన్‌ లింక్‌ను బ్రేక్‌ చేయడానికి ఎక్కువ కేసులు నమోదయ్యే ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించనున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లను ముందుగానే డీ నోటిఫై చేయాల్సి ఉంటుంది.కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇంటింటి సర్వే నిర్వహించి.. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్‌ ఉన్న వారు 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందే. అత్యవసర సేవలకు మాత్రమే కంటైన్‌మెంట్‌ జోన్‌లో అనుమతివ్వనున్నారు. మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. 65 ఏళ్లు దాటిన వాళ్లు, 10 ఏళ్లలోపు చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్త తీసుకోవాలి. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద చర్యలు తీసుకోవచ్చు. అవసరమైతే జిల్లా అధికారులు 144 సెక్షన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

Related Posts