YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నియోజకవర్గానికో మ్యానిఫెస్టో.. 225 మేనిఫెస్టోలను రిలీజ్ కు బిజేపి సిద్దం

నియోజకవర్గానికో మ్యానిఫెస్టో..  225 మేనిఫెస్టోలను రిలీజ్ కు బిజేపి సిద్దం

కర్ణాటకలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య ఆసక్తికర ఫైట్ నడుస్తున్నది. పార్టీల హామీల వర్షంలో కన్నడ ఓటర్లు తడిసి ముద్దవనున్నారు. ఒకరిని మించి మరొకరు మేనిఫెస్టోలు రిలీజ్ చేయబోతున్నారు. అయితే కాంగ్రెస్‌కు పోటీగా బీజేపీ ఏకంగా 225 మేనిఫెస్టోలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ ప్రాంతాల వారీగా రిలీజ్ చేస్తే.. బీజేపీ ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మేనిఫెస్టో ప్లాన్ చేసింది. అంటే మొత్తం 224 నియోజకవర్గాలకు 224 మేనిఫెస్టోలు రూపొందించింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఓవరాల్ కర్ణాటక మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి వామన్ ఆచార్య వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో 500 మంది ఓటర్లతో మాట్లాడి ఈ మేనిఫెస్టోలు తయారు చేసినట్లు ఆయన చెప్పారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో కలిపి మూడు లక్షల మంది అభిప్రాయాలు సేకరించారు. ఈ మేనిఫెస్టోలను ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే తమ అభ్యర్థులకు ఇచ్చి వాటిని కచ్చితంగా అమలు చేయాలని సూచించనున్నట్లు వామన్ తెలిపారు. ఈ మేనిఫెస్టోలన్నీ జిల్లా స్థాయిలో అక్కడి నేతలు ఆవిష్కరిస్తారు. అటు జేడీఎస్ కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ సుబ్రమణ్యకు మేనిఫెస్టో బాధ్యతలు అప్పగించింది.కాగా అధికార కాంగ్రెస్ తమ ప్రధాన మేనిఫెస్టోను ఈ నెల27న మంగళూరులో రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించనుంది. ఆ తర్వాతి నుంచి ఒక్కో ప్రాంతానికి ఒక్కో మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించింది. బెంగళూరు, బెల్గాం, గుల్బర్గా, మైసూర్ ప్రాంతాలకు ప్రత్యేక మేనిఫెస్టోలు కాంగ్రెస్ తయారుచేసింది. వీటిని శామ్ పిత్రోడా, పృథ్విరాజ్ చౌహాన్, మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించనున్నారు. 2013లో తామిచ్చిన మొత్తం 165 ఎన్నికల హామీలను నెరవేర్చామని చెబుతూ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తున్నది. పైగా తమ ఓవరాల్ మేనిఫెస్టోలో బెంగళూరు నగరం కోసమే ప్రత్యేకంగా ఓ చాప్టర్ కేటాయించినట్లు ఆ పార్టీ చెబుతున్నది. రాష్ట్రంలోని ఎన్జీవోలు, పారిశ్రామికవేత్తలు, యూనియన్లు, టౌన్ ప్లానర్స్‌తో మాట్లాడి ఈ మేనిఫెస్టోలు తయారు చేసినట్లు కాంగ్రెస్ చెప్పింది.

Related Posts