YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హైదరాబాద్ టాంక్ బండ్ మాదిరిగా గోదావరి బండ్ రోడ్ అభివృద్ధి

హైదరాబాద్ టాంక్ బండ్ మాదిరిగా గోదావరి బండ్ రోడ్ అభివృద్ధి

రాజమండ్రి మార్చ్ 27 హైదరాబాద్ టాంక్ బండ్ మాదిరిగా గోదావరి బండ్ రోడ్ అభివృద్ధి నగరంలో జంక్షన్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ భరత్ రామ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం పిచ్చుకలంక పర్యటక ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు..
హైదరాబాద్ టాంక్ బండ్ మాదిరిగా గోదావరి బండ్ రోడ్ ను అభివృద్ధి చేయనున్నట్లు రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గం సభ్యులు, వై ఎస్ ఆర్ సి పి పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ అన్నారు. నగరంలోని పుష్కర ఘాట్, దేవి చౌక్, ఆర్ట్స్ కాలేజ్ ప్రాంతాల్లో జరుగుతున్న జంక్షన్ ల అభివృద్ధి పనులను నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.అభిషిక్త్ కిషోర్ తో కలిసి శనివారం ఆయన పర్యటించారు.  ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ రాజమండ్రి నగరాన్ని హెరిటేజ్ సిటీగా మార్పు చేసే దిశగా అడుగులు వేస్తున్నా మని తెలిపారు.  నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు   రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతన్నట్లు తెలిపారు.  14, 15 ఆర్థిక సంఘం నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు గా రూ. 125 కోట్లను మంజూరవుతున్నట్టు చెప్పారు.  రాబోయే రోజుల్లో  రాజమండ్రి నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసే అవకాశం ఉందని, తద్వారా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.  రాజమండ్రి నగరాన్ని విశాఖ నగరానికి సమానంగా అభివృద్ధి సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పిచ్చుక లంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ఇందుకు సంభందించిన టెండర్ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు.  అలాగే హేవలాక్ బ్రిడ్జిని స్వాధీనం చేసుకుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related Posts