YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సమ్మర్ ట్రైన్స్ రెడీ తిరుపతి, వైజాగ్ నుంచి స్పెషల్ ట్రైన్స్

 సమ్మర్ ట్రైన్స్ రెడీ  తిరుపతి, వైజాగ్ నుంచి స్పెషల్ ట్రైన్స్

వేసవి లో వేడి తాకిడిని, ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతన్నారు. వేసవిలో అన్ని పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో ప్రయాణీకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ లో రైళ్ల సంఖ్య పెరగడంతో ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుదని ప్రయాణకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తిరుపతి - కాకినాడటౌన్‌ . రైలు నెంబరు 07942 ప్రత్యేక రైలు జులై 1, 8, 15, 22, 29 తేదీల్లో తిరుపతిలో రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.30కి కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. ఇదే రైలు నెంబరు 07941 జులై 2, 9, 16, 23, 30 తేదీల్లో కాకినాడటౌన్‌లో రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. షిర్డి ప్రయాణికుల కోసం  తిరుపతి - నాగర్‌సోల్‌ - తిరుపతి.. రైలు నెంబరు 07417 ప్రత్యేక రైలు జులై 6, 13, 20, 27వ తేదీల్లో తిరుపతిలో ఉదయం 7.30కి బయలుదేరి రాత్రి 8.15కి సికింద్రాబాద్‌ మరుసటి రోజు మధ్యాహ్నం 11.55కి నాగర్‌సోల్‌ చేరుకుంటుంది.తిరిగి రైలు నెంబరు 07418 జులై 7, 14, 21, 28 తేదీల్లో నాగర్‌సోల్‌లో రాత్రి 10గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 11.55కి సికింద్రాబాద్‌, రెండోరోజు ఉదయం 4 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్‌, జహీరాబాద్‌, బీదర్‌, ఔరంగబాద్‌ స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ - టాటానగర్‌ - కాచిగూడ.. రైలు నెంబరు 07438 ప్రత్యే రైలు జులై 2, 9, 16, 23, 30 తేదీల్లో కాచిగూడలో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 7.45కి టాటానగర్‌ చేరుకుంటుంది. తిరిగి రైలు నెంబరు 07439 జులై 3, 10, 17, 24, 31 తేదీల్లో టాటానగర్‌లో రాత్రి 10.50కి బయలుదేరి రెండో రోజు ఉదయం 5గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు మల్కాజగిరి, నల్గొండ, మిర్యాలగూడ[, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంరోడ్డు, పలాసా, బరంపురం, కుర్ధారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌ స్టేషన్లలో ఆగుతుంది.  విశాఖపట్నం-తిరుపతి.. రైలు నెంబరు 07479 ప్రత్యేక రైలు జులై 4, 11, 18, 25 ఆగస్టు ఒకటో తేదీన విశాఖపట్నంలో రాత్రి 7.05కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి తిరుపతి చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో రైలు ఆగనుంది.  తిరుపతి - కాచిగూడ.. రైలు నెంబరు 07146 ప్రత్యేక రైలు జులై 5, 12, 19, 26 ఆగస్టు 2వ తేదీన తిరుపతిలో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.30కి కాచిగూడ చేరుకుంటుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.లింగంపల్లి - కాకినాడ.. రైలు నెంబరు 07101 ప్రత్యేక రైలు ఈ నెల 28వ తేదీన లింగంపల్లిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.30కి కాకినాడటౌన్‌ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

Related Posts