
హైదరాబాద్, మార్చి 30,
స్కూల్ లో ఇరవై మందికి కరోనా. ఈ హాస్టల్ లో పదిహేను మందికి కరోనా. అక్కడ వందమందికి.. ఇక్కడ యాభై మందికి. ఇలాంటి వార్తలు ఈ మధ్య ఫుల్ గా వినిపిస్తున్నయ్. పిల్లలు కావడంతో కేర్ లెస్ గా ఉండడం.. భయం లేక పోవడం కామన్. మరి కరోనా అటాక్ కామనే కదా. తల్లిదండ్రుల గుండెలు భయంతో ఉంటాయి. పిల్లలకి ఏమైనా అయితే.. పెద్ద ఇష్యూనే అవుతుంది. అందుకే.. తెలంగాణ సర్కార్ సీరియస్ డెసిషన్ తీసుకుంది. విద్యాసంస్థలు బంద్ అనేసింది.అంత వరకూ బానే ఉంది. మరి మిగతా ఏమీ బంద్ చేయరా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా అందరూ బార్లపైనే పడుతున్నారు. బార్లని ఓపెన్ చేస్తారు కానీ.. బడులు ఓపెన్ చేయరా. బార్లలో లేని కరోనా బడుల్లో ఉందా. బార్లు ముద్దు.. బడులు వద్దా అంటూ.. ఆందోళనకి దిగుతున్నారు టీచర్లు. స్కూల్స్ యాజమాన్యాలు కూడా అదే బాట పట్టాయి. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బతకలేక బడి పంతులు అనే పాత సామెత ఏదో గుర్తు చేసుకుంటున్నారు. వేరే పని చేసే పరిస్థితి లేకపోవడం.. టీచర్ గా గుర్తింపు వచ్చాక.. వారు కూడా మరే ఇతర పనులూ చేయలేరు. ఇది కామనే కదా.అందుకే.. ఇప్పుడు టీచర్లు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. బార్లు అయితే ఓపెన్ చేస్తారు కానీ.. బడులు ఓపెన్ చేయరా.. మీ సర్కార్ కి ఏది ఎక్కువ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.పాపం సర్కార్ మాత్రం ఏం చేయగలుగుతుంది.. ఏం ఆన్సర్ ఇవ్వగలుగుతుంది చెప్పండి. బార్లు క్లోజ్ చేస్తే.. ఆదాయం పడిపోతుంది. బడులు ఓపెన్ చేస్తే.. పిల్లలకి కరోనా వస్తే.. ఇష్యూ సీరియస్ అవుతుంది. అటు బార్లు క్లోజ్ చేయలేక.. బడులు ఓపెన్ చేయలేక.. ఈ కన్ ఫ్యూజన్ కి ఎలా చెక్ పెట్టాలో తెలీక సతమతం అవుతోంది. అందుకే.. బడులు తెరిస్తే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో కూడా ఉందంట తెలంగాణ సర్కార్