YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీతమ్మ సాగర్ నిర్వాసితుల కష్టాలు ఇంతింత కాదయా

సీతమ్మ సాగర్  నిర్వాసితుల కష్టాలు ఇంతింత కాదయా

ఖమ్మం, మార్చి 30,
సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టుతో నిర్వాసితులుగా మారే తమకు న్యాయం చేశాకే.. ప్రాజెక్టు, కరకట్టలు, బండ్స్‌, కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించక ముందే నిర్వాసిత రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతుసంఘం డిమాండ్‌ చేస్తోంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం గ్రామంలో సుమారు 170 ఏండ్ల కిందట నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 200 మీటర్ల దిగువన సీతమ్మ సాగర్‌ బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్నారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద రూ.2,632 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజీని 2022 సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, గోదావరి నదికి అడ్డంగా నిర్మించే రన్‌ ఆఫ్‌ రివర్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని వేలాది మంది ఆదివాసీల జీవితాలు ఛిన్నాభిన్నం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అశ్వాపురం, చర్ల, మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లోని అడవిబిడ్డలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జీవనాధారమైన పంట పొలాలను పోగొట్టుకొని కుటుంబాలను ఎలా పోషించుకోవాలని నిర్వాసితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.గిరిజనులు పంట పొలాల్లో విద్యుత్‌ మోటార్లు, నీటి గుంటలు, పైపులైన్లు వేసుకొని ఎంతో అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు పేరుతో ఆ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఒకటి, రెండు ఎకరాలున్న రైతుల భూములు స్వాధీనం చేసుకుంటే వారి మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి రూ.25లక్షల పరిహారం (అవార్డ్‌) ఇవ్వాలని గిరిజన రైతులు డిమాండ్‌ చేస్తుంటే ప్రభుత్వం కేవలం రూ.6 లక్షలతో సరిపుచ్చే యత్నాలు చేస్తున్నట్టు రైతుసంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, అనేక గ్రామ సభల్లో రైతులు ప్రాజెక్టు వివరాలు, పరిహారం ఇవ్వలేదని రెవెన్యూశాఖ అధికారులను నిలదీశారు. ఈ నేపథ్యంలోనే బలవంతంగా సర్వే చేయడాన్ని రైతులు ప్రతిఘటిస్తున్నారు.భూమి కింద భూమి ఇవ్వాలి. ఎంత భూమి తీసుకుంటే అంత ఇవ్వాలి. భూమి ఇవ్వకుండా.. ఏదో చేస్తామని బలవంతంగా లాక్కుంటే మాత్రం ఊరుకోం. ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధం.ఐదెకరాల భూముంటే మూడెకరాలు ఉన్నట్టుగా చూపించారు. రెండు నెలల్లో దరఖాస్తులు చేసుకోమన్నారు. దరఖాస్తులు ఇచ్చేందుకు సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ దగ్గర పడిగాపులు కాశం. రైతులను హీనంగా చూస్తున్నారు. కనీసం లోపలికి కూడా రానీయలేదు. కరోనా పేరుతో అప్లికేషన్లు కూడా తీసుకోకుండా.. గుమ్మం దగ్గర పడేసి పొమ్మన్నారు. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా అందలేదంటున్నారు.ఈ ప్రాజెక్టు కోసం 2,900 ఎకరాల భూమి సేకరించాలి. ఇంకా సర్వే దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి ఇంతవరకూ ఎటువంటి అవార్డు ప్రకటించలేదు. చర్ల మండలంలో రెండు గ్రామాల్లో మాత్రమే గ్రామసభలు పెట్టి వివరించామంటున్నారు.

Related Posts