అడవికి రారాజు సింహానికి ఒక ఎయిర్ కూలర్...రాయసం ఉట్టిపడే బెంగాల్ టైగర్ కూల్ గా ఉండేందుకు ప్రత్యేకంగా కూలర్లు...అవును మీరు విన్నది నిజమే..రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి జనాలు బెంబేలెత్తిపోతుంటే వన్య ప్రాణాలను సంరంక్షించేలా తిరుపతిలోని ఎస్వీ జూ పార్కులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎలుగు బంట్లు, జింకలు, నెమళ్లు, అడవి కోళ్లకు ఎండ నుంచి ఉపశమనం పొందేలా చిరు జల్లులు కురిపించే స్పింకర్లు, రెయిన్ గన్లు ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మండి పోతున్నాయి. ప్రజలు బయటకి రావాలంటే జడసిపోతున్నారు..ప్రజల సరిస్థితులే ఇలా ఉంటే ఇక వన్యప్రాణుల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.అడవుల్లో జంతువులకు తాగునీరు ఆహారం దొరక్క అలమటిస్తుంటాయి. అయితే తిరుపతిలోని ఎస్వీ జూ పార్కులోని వన్యప్రాణాలకు సూర్య ప్రతాపం నుంచి ఉపశమనం లభించేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు.
సింహాలు, పులులు, ఎలుగుబంట్లు తదితర వన్య ప్రాణులు ఎండ వేడిమి తట్టుకునేలా ఎయిర్ కూలర్లు, చిరు జల్లులు కురిసేలా రెయిన్ గన్ లు ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఎస్వీ జూ పార్కు దాదాపు 1200 ఎకరాల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 385 ఎకరాల్లో జూ పార్కును విస్తరించారు. 82 రకాల వన్య ప్రాణాలు ఈ జూ పార్కులో ఉంటున్నాయి. సింహాలు, బెంగాల్ టైగర్లు, వైట్ టైగర్లు, ఏనుగులు, ఎలుగు బంట్లు, జింకలు, దుప్పులు, ఆస్ట్రిచ్, నెమళ్లు ఇలా మొత్తంగా 1082 వన్య ప్రాణులు ఎస్పీ జూపార్కులో అధికారులు అందుబాటులో ఉంచారు. అయితే ప్రస్తుతం ఉష్టోగ్రతలు విపరీతంగా నమోదు అవుతుండటంతో జూ పార్కు అధికారులు జంతువులను ఎండల నుంచి కొంత వరకైనా సేద తీరేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. సింహం, పులులు తదితర జంతువులకు ప్రత్యేకంగా కూలర్లు ఏర్పాటు చేశారు. జూ పార్కులో దాదాపు 40 కి పైగా కూలర్లు అందుబాటులో ఉంచి వన్యా ప్రాణులు ఎండ నుంచి రక్షణ కల్పిస్తున్నారు.గజ రాజుల కోసం జూ పార్కులో ప్రత్యేకంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు..ఇక జింకలు..అడవి దున్నలు..దుప్పుళు..నెమళ్లు అడవి కోళ్లు.. ఆస్ట్రిచ్ తదితర వాటికి చిరు జల్లులు కురిసేలా జూ పార్కులో ప్రత్యేకంగా స్పింకర్లు, రెయిన్ గన్లు ఏర్పాటు చేశారు. ఉదయం నంచి సాయంత్రం దాకా వీటి ద్వారా చిరు జల్లులు కురుస్తుంటడంతో వన్య ప్రాణాలు బతుకు జీవుడా అంటూ సేద తీరుతున్నాయి ఇక పక్షుల కోసం ప్రత్యేకంగా కూలింగ్ పెయింట్...కస్ కస్ మాట్స్..గ్రీన్ క్లాత్ ద్వారా ఎండ నుంచి సేద తీరులే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు..అడవి కోళ్లు తదితర పక్షులు ఉండే బోనుపై సూర్య కిరణాలు నేరుగా పడకుండా ప్రత్యేకంగా తుంగా గ్రాస్ ఉంచి చల్లదనం వచ్చేలా ఏర్పాటు చేశారు..వేసవిలో ఏనుగులకు ప్రత్యేకంగా చల్లదనం ఉండేలా పుచ్చకాయలు..కీర వంటి వాటిని ఆహారంగా వైద్యుల పర్యవేక్షణలో అందిస్తున్నారు. ఎస్వీ జూపార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చర్యలతో జంతువులు సేద తీరుతుంటే వాటిని చూసేందకు వచ్చే పర్యాటకులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.