YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లా...ఒక్కటవుతారా

మళ్లా...ఒక్కటవుతారా

విజయవాడ, మార్చి 30, 
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు హాట్ హాట్ గా ఉన్నాయి. జగన్ ఇప్పుడు పూర్తిగా బలవంతుడిగా ఉన్నారు. అది వాపు అని కొందరు అనుకోవచ్చు. బలం అని వైసీపీ నేతలు భ్రమించ వచ్చు. ఇప్పటికైతే జగన్ పూర్తి స్థాయిలో బలంగా ఉన్న మాట వాస్తవం. కానీ అదే సమయంలో విపక్ష పార్టీలు మాత్రం బలహీనంగా తయారయ్యాయి. ఏపీలో ఎప్పుడూ ముఖాముఖీ పోటీ ఉంటేనే తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజీగా ఉంటుంది.ఇది చరిత్ర చెప్పిన సత్యం. అంతేకాకుండా చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసినా గెలుపు సాధ్యం కాలేదు. ఇక పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఆరేళ్లవుతున్నా కనీస స్థాయిలో మెరుగుపడలేదు. అసెంబ్లీలో ఒక్క స్థానం సాధించుకోగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ‌్ ల నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం లేదనే అనుకోవాలి. ఇద్దరూ విడివిడిగా పోటీ చేస్తే ఇద్దరికీ మరోసారి చేదు అనుభవం తప్పదుఅందుకే ఇప్పడు ఇద్దరినీ ఒక్కటిచేసే ప్రయత్నాలు మొదలయ్యాయంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు ఈ డీల్ ను చేస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ పారిశ్రామికవేత్త ఇటు పవన్ కల్యాణ్ కు, అటు చంద్రబాబుకు సన్నిహితులు కావడంతో ఇద్దరూ ఒక్కటయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. బీజేపీతో పొత్తును జనసేన క్యాడర్ అంగీకరించడం లేదు.అయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఇటు పవన్ కల్యాణ్, అటు చంద్రబాబు ఇద్దరూ బీజేపీతో ఇప్పటికిప్పుడు కయ్యానికి దిగే ఛాన్స్ లేదు. అయితే ఇప్పటికే పవన్ కల్యాణ్ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇది గమనించిన సదరు పారిశ్రామికవేత్త టీడీపీతో టయ్యప్ కు పవన్ కల్యాణ్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు దీనిపై క్లారిటీ రాకపోయినా భవిష్యత్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఒక్కటయ్యే అవకాశముంది. ఎందుకంటే ఇద్దరికి ఒకరి తోడు మరొకరికి అవసరం కాబట్టి.

Related Posts