YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నామినేషన్లు పూర్తి... గెలుపే తరువాయి

నామినేషన్లు పూర్తి... గెలుపే తరువాయి

నల్గొండ, మార్చి 30, 
నాగార్జున సాగర్‌లో బైపోల్ హీట్ పీక్ స్టేజ్ చేరుతోంది. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోండగా.. టీఆర్‌ఎస్‌, బీజేపీలు మాత్రం అభ్యర్థులను ఎంపిక చేసేశాయి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ పేరును గులాబీ బాస్ ఖరారు చేశారు. ఆయనకు బీ ఫాం అందచేయనున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే..బీజేపీ  నివేదితా రెడ్డి పేరు ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బరిలో దిగిన సంగతి తెలిసిందే.. ఇక ఉపఎన్నిక ప్రచారానికి 30 మందితో కూడిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ ప్రకటించింది. బండి సంజయ్‌, డీకే అరుణ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌, అర్వింద్‌, రాజాసింగ్‌, రఘునందన్‌రావు, రాంచందర్‌రావు, జితేందర్‌రెడ్డి, మోహన్‌రావు, వివేక్‌, విజయశాంతి స్టార్‌ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు.ఇక సాగర్‌లో విక్టరీ కొట్టేందుకు గులాబీ దళపతి కేసీఆర్‌ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. టికెట్‌ రేస్‌లో ఉన్న నేతలతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా..నోముల భగత్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రచారానికి మంత్రులు వెళ్లనున్నారు. ఏప్రిల్‌ మొదటివారం నుంచి తొమ్మిదిమంది మంత్రులు, రెండో వారంలో మంత్రి కేటీఆర్‌ విస్తృతంగా ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.మరోవైపు దివంగత నేత నోముల నర్సింహయ్య సతీమణి.. లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. హాలియాలో మహిళల సమావేశానికి హాజరైన ఆమె.. భర్తను తలుచుకొని విలపించారు. నర్సింహయ్యకు మహిళలంటే ఎంతో గౌరవమని.. మీ అందరినీ చూస్తుంటే ఆయన మనల్ని విడిచి పోలేదు అనిపిస్తోందంటూ వేదిక మీదనే ఏడ్చేశారు. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.

Related Posts