YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రియల్ హాట్ స్పాట్ గా భాగ్యనగరం

రియల్ హాట్ స్పాట్ గా భాగ్యనగరం

హైద్రాబాద్, మార్చి 30, 
రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ హాట్ స్పాట్‌గా మారిందనే అధ్యయనాలు నిజమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటి భవన నిర్మాణ అనుమతుల జారీ. వర్తమాన సంవత్సరంకు సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్న దాని కంటే ఎక్కువగానే ఆదాయం సమకూరింది. గత సంవత్సరం జీహెచ్‌ఎంసీ కేవలం 8600 భవన నిర్మాణ అనుమతులను ఇచ్చి రూ. 535 కోట్లను సంపాదించుకుంది. ఈసారి వర్తమాన ఆర్థిక సంవత్సరం ఇంకా ముగియకముందే దాదాపు 15వేల భవన నిర్మాణ అనుమతులను జారీ చేసి, వాటి ద్వారా రూ.590 కోట్ల మేరకు ఆదాయం వచ్చిందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఈ ఆదాయం రూ. 758 కోట్లకు చేరే అవకాశముంది. ఇప్పటికే వచ్చిన ఆదాయం గాక, జారీ చేసిన అనుమతల ప్రకారం మరో రూ.166 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన 2014-15లో, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వంటి కారణాలతో దేశంలోని ఇతర మహానగరాల్లో రియల్ ఎస్టేట్ కుదేలైనా హైదరాబాద్ నగరానికి దేశ విదేశీ కంపెనీల నుంచి బహుళజాతి కంపెనీలు నిర్మాణాల కోసం వచ్చాయి. తుపాన్, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా హైదరాబాద్ సేఫ్ ప్లేస్‌గా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గుర్తించటంతో ఆ సంస్థలకు చెందిన డేటా బేస్, ఆస్తులు, మ్యాన్‌పవర్ సురక్షితంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించినందునే నగరంలో ఈ రకంగా నిర్మాణ అనుమతుల సంఖ్య పెరిగింది. గత సంవత్సరం టౌన్‌ప్లానింగ్‌కు సమకూరిన ఆదాయంతో పోల్చితే ఈసారి అదనంగా రూ.231 కోట్లకు పెరిగింది. అత్యధికంగా వెస్ట్‌జోన్ పరిధిలో అనుమతులు మంజూరు చేసినట్లు, ఆ తర్వాతి స్థానంలో ఈస్ట్‌జోన్ ఉన్నట్ల అధికారులు తెలిపారు. మాదాపూర్, గచ్చిబౌలీ, రాయదుర్గం, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలకు కేంద్రాలుగా మారాయి. దీంతో అక్కడ అత్యధికంగా కమర్షియల్ భవనాల నిర్మాణాలు జారీ అయ్యాయ. కూకట్‌పల్లి, దీప్తిశ్రీనగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో నివాస భవనాలకు డిమాండ్ బాగా పెరిగి, అదే తరహా బడా భవనాల నిర్మాణాల కోసం అనుమతులు జారీ అయ్యాయి. ఒకవైపు కమర్షియల్ భవనాల నిర్మాణాలు జరుగుతుండగా, అంతే వేగవంతంగా నివాసయోగ్యమైన భవనాల నిర్మాణాలు కూడా జరుగుతున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. రియల్ భూమ్ మున్ముందు మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Related Posts