విశాఖపట్నం మార్చి 30,
స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మరోసారి విశాఖలో కార్మిక సంఘాలు సమావేశమైయ్యారు.ప్రభుత్వం రంగ పరిశ్రమ లు ,స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ ఆపాలని డిమాండ్ చేస్తూ విశాఖ లో అఖిలపక్షం కార్మిక సంఘాల నేతలు గళమెత్తారు.కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వెళ్తుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ పై ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదని కార్మిక సంఘాల నేత జగ్గునా యుడు ఎన్నారై.ఈ ఉద్యమాన్ని మరింత ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూడా వచ్చే నెల నుండి రిలే నిరాహారదీక్ష లు నిర్వహిస్తామని ఈ ఉద్యమంలో ప్రజలు కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు.