YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

నాలాగ ఇతర అమ్మాయిలు కాకుడదు

నాలాగ ఇతర అమ్మాయిలు కాకుడదు

మైనర్ బాలిక అత్యాచారం కేసులో వివాదస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును దోషిగా తేల్చిన న్యాయస్థానం, జీవితఖైదు విధించింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదురించిన ఆ బాలిక, నాలుగు దశాబ్దాలపాటు లక్షలాది మందితో ఆధ్యాత్మిక గురువుగా పూజలందుకున్న ఆశారాంను న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టింది. తీర్పు అనంతరం బాధితురాలు మాట్లాడుతూ... నా ఐదేళ్ల గృహ‌నిర్బంధంతో నేటితో ముగిసిందని వ్యాఖ్యానించింది. జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారం తనపై అత్యాచారానికి పాల్పడటంతో భయపడి ఒక్కసారి గందరగోళంలోకి వెళ్లిపోయానని, ఘటన జరిగిన తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉండిపోయినట్టు తెలిపింది. చివరికు మాత్రం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. తనపై అత్యాచారానికి పాల్పడిన ఆశారాం, దానికి సంబంధించి సాక్షులను హత్యచేసి, నా విద్యాభ్యాసానికి భంగం కలిగించాడని వాపోయింది. తన కుటుంబాన్ని వెంటాడు.. వాడు చేసిన నేరానికి తాను ఐదేళ్లు గృహ‌నిర్బంధం అనుభవించానని అవేదన చెందింది. ఈ విషయంలో కొందరు నాపై జాలిచూపించారు.. మరికొందరు సూటిపోటి మాటలతో బాధించారు.. చాలా బెదరింపులు కూడా ఎదురయ్యాయి, ఇవన్నీ భయంకరమైన పీడకలగా వెంటాడాయని తెలిపింది. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం బలంగా ఉండేది, కానీ నేరస్థుడు పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో కేసు నుంచి బయటపడే అవకాశం ఉందని ఏదో ఒకమూల సందేహాం వెంటాడేదని, అయితే తీర్పుతో నా అనుమానం పటాపంచలైందని పేర్కొంది. ప్రస్తుతం బీకామ్ చదువుతోన్న బాధితురాలు, నిరంతరం నా మనసులో ఆలోచనలు ఈ కేసు చుట్టూ తిరుగుతూ ఉండేవని తెలియజేసింది. నేను ఇప్పుడు నా భవిష్యత్ గురించి ఆలోచిస్తా, నా వయస్సులో ఉన్న ఇతర అమ్మాయిలాగే నా జీవితాన్ని గడుపుతానని సంతోషం వ్యక్తం చేసింది. తీర్పు అనంతరం బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశాడు.. తన కూతురు మొహంలో ఇప్పుడు సంతోషం ఉందని, ఇప్పుడు తాము చనిపోయినా సంతృప్తిగా ఉంటుందని భావోద్వేగానికి గురయ్యారు. కేసును వెనక్కి తీసుకోవాలంటూ అయిదేళ్లుగా తమను అనేక రకాలుగా ఒత్తిడికి గురి చేశారు.. చంపుతామని బెదిరించారు.. చివరికి న్యాయమే గెలిచింది’ అని ఆయన అన్నారు. ఆశారాంకు శిక్ష పడటంలో విశేషంగా కృషి చేసిన పోలీసులు, న్యాయవాదులు, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Related Posts