YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఏపీ డిమాండ్ కు న్యాయం ఉంది

ఏపీ డిమాండ్ కు న్యాయం ఉంది

విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి అవసరమైన అన్ని వసతులు కల్పించాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నామని పునరుద్ఘాటించారు. బీజేపీ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుందో తనకు అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎంచంద్రబాబు నాయుడు, ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదేనని షిండే అభిప్రాయపడ్డారు. ఏపీ ఇంతగా పోరాటం చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ స్పందించడం లేదని, దీన్ని ఇలాగే కొనసాగించాలని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తిస్థాయి మెజార్టీ సాధించి, మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కథువా, ఉన్నావ్‌, గుజరాత్‌ అత్యాచార ఘటనలు చాలా బాధాకరమని అన్నారు. గత ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను ఏవీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. అన్ని వర్గాల్లోనూ మోదీపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ ఆధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Related Posts