YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొత్త ఎమ్మెల్సీలకు పదోన్నతి

కొత్త ఎమ్మెల్సీలకు పదోన్నతి

హైదరాబాద్, మార్చి 31, 
గెలుపుతో ఊపు తెచ్చిన ఆ ఇద్దరికి త్వర‌లో ప్రమోష‌న్ లభిస్తుందా? వ‌రస దెబ్బల‌తో ఇబ్బందిప‌డ్డ టీఆర్‌ఎస్‌లో ఉత్సాహం వచ్చిందా? వచ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ గెలుపు.. బాట‌లు వేస్తుందా? కీల‌క ప‌ద‌వుల్లో మార్పులు చేర్పుల‌పై టీఆర్‌ఎస్‌లో చర్చ జ‌రుగుతోందా?ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మాజీ ప్రధాని పీవీ కూతురును టీఆర్ఎస్ త‌ర‌ఫున ఎమ్మెల్సీ బ‌రిలోకి దింపి ఆశ్చర్య ప‌రిచారు సీఎం కేసియార్. అనుకున్నట్టే ఆమెను గెలిపించి హైద‌రాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో త‌మ‌కు ప‌ట్టు స‌డ‌ల‌లేద‌ని నిరూపించారు. బీజేపీ సిట్టింగ్ సీటును టీఆర్ఎస్ కైవ‌శం చేసుకోవడానికి పీవీ లెగ‌సీ క‌లిసొచ్చింద‌ని అంచ‌నా వేసింది అధికారపార్టీ. శ‌త‌జ‌యంతి ఉత్సవాల‌ను త‌ల‌కెత్తుకున్న స‌మ‌యంలో గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లేదా రాజ్యస‌భ‌కు సుర‌భివాణిని పంపొచ్చనే అంచ‌నాలు ఉండేవి. ఏకంగా ఓట్ల బ‌రిలో నిలిపి అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీల‌ను ఇర‌కాటంలోకి నెట్టారు. సక్సెస్ కూడా అయ్యారు. ఫ‌క్తు కాంగ్రెస్ ఫ్యామిలీ అయిన పీవీ కుటుంబాన్ని టీఆర్ఎస్‌వైపు తిప్పుకోవడానికి కేసియార్  పెద్ద క‌స‌ర‌త్తే చేశారు. ఇప్పుడు కేబినెట్‌లోకి తీసుకుంటానని సుర‌భివాణికి హామీ ఇచ్చిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. ఈ జూన్‌తో శాస‌న‌మండ‌లి ఛైర్మన్ గుత్తా సుఖేంద‌ర్‌ రెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. గుత్తా స్థానంలో సుర‌భివాణికి మండ‌లి చైర్మన్‌ను చేస్తార‌న్న చర్చ కూడా నడుస్తోంది. ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి  సురభివాణి ఇప్పుడే వ‌చ్చినా పీవీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఆలోచ‌న చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యావేత్త కావ‌డం, తొలిసారి ఓ మ‌హిళ‌కు ఈ ఉన్నత స్థానం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని భావిస్తున్నారట. కేబినెట్‌లోకి ఇప్పట్లో తీసుకోలేని ప‌రిస్థితుల్లో సురభివాణికి మండ‌లి చైర్మన్ ప‌ద‌వీ ఇచ్చే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల టాక్‌.ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రతికూల ప‌రిస్థితుల్లో పోటీకి దిగి సిట్టింగ్ స్థానంలో మ‌ళ్లీ గెలిచారు. రెండోసారి పోటీ చేయ‌డం ఇష్టంలేక‌పోయినా  కేసియార్ నిర్ణయంతో బరిలోకి దిగారు. ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవ‌డం, పీఆర్‌సీపై హామీ ఇవ్వడం, విప‌క్షాల ఓటు చీలడంతో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. పార్టీ నేత‌ల‌తోపాటు మూడు ఉమ్మడి జిల్లాల్లో ప‌ల్లాకు ఉన్న  సొంత కాలేజీల నెట్‌వ‌ర్క్ ద్వారా ఎక్కువ ఓట్లు పొందార‌ని హైక‌మాండ్ అంచ‌నా వేసింది. ప‌ల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యర్థిగా ఉండ‌టం ఓటింగ్‌లో క‌లిసొచ్చింద‌ని పార్టీ నేత‌లు బ‌హిరంగంగా చెబుతున్నారు. పైగా ప్రొఫెసర్‌ కోదండ‌రాం బ‌రిలో ఉండ‌గా టీఆర్ఎస్ గెల‌వ‌డంతో కేసియార్ ఆనందానికి అవ‌ధుల్లేవట. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి వీక్‌ కావడంతో కోదండరామ్‌ రూపంలో ప్రమాదం పొంచి ఉందని ప్రతిష్టగా తీసుకుని సక్సెస్‌ అయ్యారు.
స‌భ్యత్వ బాధ్యతలతో‌పాటు ఖ‌‌మ్మం, హుజూర్‌న‌గ‌ర్ లాంటి ఎన్నిల్లో బాధ్యత‌లు తీసుకుని గెలుపువైపు న‌డించార‌నే పేరు ప‌ల్లాకు ఉంది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక ప‌ల్లాకు కేబినెట్ బెర్త్ ఖాయ‌మ‌నే ప్రచారం జ‌రిగింది. జిల్లాలు, సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌తో అది సాధ్యం కాలేదు. దీంతో భ‌విష్యత్‌లో ఎప్పుడు మార్పులు చేర్పులు చేసినా ప‌ల్లాకు మంత్రిగా ప్రమోష‌న్ ఖాయ‌మ‌నే అంచ‌నాలున్నాయి. ప్రస్తుతం రైతు స‌మ‌న్వయ స‌మితి రాష్ట్ర అధ్యక్షుడిగా కేబినెట్ హోదాలోనే ఆయన ఉన్నారు. గ‌తంలో మండ‌లిలో విప్‌గా ప‌నిచేశారు. కేసియార్  గుడ్‌లుక్స్‌లో ఉన్న ప‌ల్లాకు ఏ క్షణ‌మైనా ప్రమోష‌న్ ఖాయ‌మ‌నే ఆశ‌ల్లో ఉన్నారు ఆయ‌న స‌న్నిహితులు

Related Posts