YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కర్ణాటక సమరంలో 3374 మంది

 కర్ణాటక సమరంలో 3374 మంది

 కర్ణాటక ఎన్నికలు...ప్రస్తుత జాతీయ రాజకీయాలను వెడెక్కిస్తున్నఎన్నికలు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఓటమి, ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా నిరాకరణ, కావేరీ జల వివాదం, తెలంగాణ మైనార్టీ బిల్లు తిరస్కరణ. బాలికలపై మహిళలపై హత్యాచారాలు, కరెన్సీ కొరత వంటి పరిణామాల తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో  బీజేపీకి ఈ ఎన్నికలు సవాలనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బుధవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన అనంతరం 3374 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్‌ కంటే బీజేపీ నుంచి  మంది అభ్యర్థులు అధికంగా ఉన్నారు. మంది అభ్యర్థులు మొత్తం 4853 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల కమిషనర్‌ సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. బీజేపీ నుంచి  మంది అభ్యర్థులు కాంగ్రెస్‌ నుంచి 251 మంది జేడీఎస్‌ నుంచి 281బీఎస్‌పీ నుంచి 22 సీపీఐ నుంచి ముగ్గురు సీపీఎం నుంచి ఇద్దరు ఎన్‌సీపీ నుంచి 15 మంది రంగంలో ఉన్నారు.స్వతంత్ర అభ్యర్థులు 1678 మంది బరిలో ఉండగా గుర్తింపు లేని రాజకీయ పార్టీల తరఫున 596 మంది అభ్యర్థులు మిగిలారు. 3374మంది అభ్యర్థుల్లో మహిళలు 259మంది కాగా పురుషులు 3115మంది ఉన్నారు. ఉపసంహరణకు మరో రెండు రోజుల గడువు ఉంది. ఇక బెంగళూరు పరిధిలోని నియోజకవర్గాల నుంచి 471మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ముళబాగిలు నియోజకవర్గంలో అత్యధికంగా 60 మంది అభ్యర్థులుండగా వరుణలో 35మంది హుబ్లీ ధార్వాడలో 35 మంది ఉన్నారు. నియోజకవర్గాల్లో 15 మందికి పైగా అభ్యర్థులు ఉన్నారు. ఉత్తరాది పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాలలో అధికారం చేపట్టి తన సామ్రాజ్యాన్ని దక్షిణాదిన కూడా స్థాపించాలనే దృఢ నిశ్చయంతోపాటు ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ను ఇక్కడ కూడా ఓడించి మరింత బలహీన పరచాలనే ధ్యేయంతోనే పావులు కదుపుతుంది. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో  బీజేపీ అధికారం చేపడుతుందో లేక కాంగ్రెస్‌ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.... 

Related Posts