YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పదేళ్ల యూపీఏ... ఇప్పుడు ఎన్డీయే

పదేళ్ల యూపీఏ... ఇప్పుడు ఎన్డీయే

న్యూఢిల్లీ, మార్చి 31, 
యూపీఏ దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ప్రధానిగా సేవలందించారు. అయితే ఆయన హయాంలో ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ప్రమేయం లేకపోయినా ఏదో ఒక స్కామ్ కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటూనే ఉంది. దాని ఫలితమే వరుసగా రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ హస్తిన పీఠానికి దూరం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ నిజంగా అవినీతిచేసిందో? ఆరోపణలో తెలియదు కాని అప్పుడు ప్రజలు మాత్రం సంతృప్తికరంగానే ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం.ఇక ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లవుతుంది. ఈ ఏడేళ్లలో దేశం ఏం అభివృద్ధి సాధించిందని ప్రశ్నించుకుంటే ప్రశ్న మాత్రం దొరకదు. అయితే అవినీతి పదం అన్నది మోదీ హయాంలో వినపడలేదు. అయితే అవినీతి లేకపోయినా పెద్ద యెత్తున కార్పొరేట్ కరప్షన్ ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రతిదీ ప్రయివేటీకరణ చేస్తానని చెప్పడం, పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టడానికేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.నిజానికి కాంగ్రెస్ హయాంలో కంటే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. నోట్ల రద్దు అంశం దగ్గర నుంచి తీసుకుంటే పెట్రోలు ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు ప్రజలకు అందుబాటులో లేదు. గ్యాస్ సబ్సిడీని కూడా ఎత్తివేసి మోదీ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. పోనీ మోదీ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య ఏదైనా తీరిందా? అంటే అదీ లేదు. సోషల్ మీడియాలో తమకు జాబ్ కావాలంటూ నిరుద్యోగ యువత చేస్తున్న అప్పీల్ ఇందుకు ఉదాహరణ.ఇప్పుడు జనాలకు కాంగ్రెస్ హయాం నయమనిపించేలా మోదీ పాలన సాగుతుంది. అవినీతి చేసినా ప్రజల విషయంలో కాంగ్రెస్ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండేదని, ప్రజల డిమాండ్లకు కాంగ్రెస్ తలవంచేదని అంటున్నారు.కానీ మోదీ మాత్రం తాను తీసుకున్న నిర్ణయాలకు వెనక్కు తగ్గరు. ఇందుకు గత మూడు నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనే ఉదాహరణ. అవినీతిరహిత పాలన అంటూ జబ్బలు కొట్టుకుంటున్నా మోదీ పాలన క్రమంగా భ్రమలు తొలగిపోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందంటున్నారు.

Related Posts