YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పనబాక ప్రచారం

పనబాక ప్రచారం

నెల్లూరు
 వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు మండలం, తెగచర్ల గ్రామాల్లో తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రేపు జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీ పోటీ చేస్తున్నాయని ఆమె అన్నారు. ఒకటి బిజెపి రెండు వైసిపి, మూడు టిడిపి పార్టీలు పోటీ చేస్తున్నాయని ఆమె అన్నారు.
ఇందులో ఒకటి బిజెపి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆమె తెలిపారు. మన్నవరం భెల్ పరిశ్రమ, శ్రీకాళహస్తి... నడికుడి రైల్వే ప్రాజెక్టు, లను పక్కన పెట్టారని విమర్శించారు. ఈ రోజు బిజెపి పార్టీ ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని పనబాక లక్ష్మి ఆరోపణలు గుప్పించారు.
వైసిపి పార్టీ ఎన్నికల ప్రచారంలో 25 ఎంపీ లను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తామని పదే పదే అబద్దాలు చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. ఈ రోజు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, గ్యాస్ వెయ్యి రూపాయలు, పెట్రోల్, డీజిల్, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నా,రాష్ట్ర ప్రభుత్వం ఆదుపుచేయలేక పోతుందని పనబాక లక్ష్మి అన్నారు. ఇలాగే ఉంటే సామాన్య ప్రజలు రాష్ట్రంలో జీవించలేని పరిస్థితి దాపురించిందని పనబాక లక్ష్మి వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించారు...
టిడిపి రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినపుడు, తెలుగుదేశం పార్టీ అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలదని అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు ని గెలిపించారని ఆమె అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించారని పనబాక లక్ష్మీ తెలిపారు. మనకు, తనను గెలిపిస్తే పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై పోరాడుతానని అన్నారు.

Related Posts