YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం విదేశీయం

భార‌త్‌ తో వాణిజ్య సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణకు పాకిస్థాన్ గ్రీన్ సిగ్న‌ల్

భార‌త్‌ తో వాణిజ్య సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణకు పాకిస్థాన్ గ్రీన్ సిగ్న‌ల్

న్యూఢిల్లీ మార్చ్ 31
 భార‌త్‌ తో వాణిజ్య సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణకు బుధ‌వారం పాకిస్థాన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు అక్క‌డి మీడియా వెల్ల‌డించింది. రెండు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొనే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్న సంద‌ర్భంలో పాకిస్థాన్ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. జూన్ 20 వ‌ర‌కు ఇండియా నుంచి ప‌త్తిని దిగుమ‌తి చేసుకోవ‌డానికి ఆర్థిక వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ ఆమోదం తెలిపిన‌ట్లు పాక్ మీడియా చెప్పింది. చ‌క్కెర దిగుమ‌తిపై కూడా త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది. గ‌త 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా పాకిస్థాన్ ప‌త్తి దిగుబ‌డి భారీగా తగ్గిపోవ‌డంతో భార‌త్ నుంచి దిగుమ‌తి చేసుకోవాల‌ని నిర్ణ‌యించింది.అయితే దీనిపై ఇండియా అధికారికంగా స్పందించ‌లేదు. 2019లో జ‌మ్ముక‌శ్మీర్‌కు ఉన్న ప్ర‌త్యేక హోదాను ర‌ద్దు చేసిన త‌ర్వాత ఇండియాతో వాణిజ్య సంబంధాల‌ను పాకిస్థాన్ నిలిపేసింది. కానీ గ‌త నెల‌లో ఊహించ‌ని విధంగా రెండు దేశాలు స‌రిహ‌ద్దులో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి క‌ట్టుబ‌డ‌తామ‌న్న ప్ర‌క‌ట‌న‌ను జారీ చేశాయి. ఇక ఈ మ‌ధ్యే రెండు దేశాల ప్ర‌ధాన మంత్రులు కూడా లేఖ‌లు రాసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Related Posts