మన జాతీయ జెండా కు మూడు రంగుల గా ఏర్పడి మార్చ్ 31 3021 కి సరిగ్గా వంద ఏళ్ళు అయిందని ప్రధాన ఉపాధ్యాయూరాలు పద్మావతమ్మ అన్నారు, స్థానిక డోన్పట్టణంలో ని పాత పేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మావతమ్మ అధ్యక్షత న
మూడు రంగుల జెండా వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు, పాఠశాల ఉపాధ్యాయులు
కార్యక్రమంలో వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ పింగళి వెంకయ్య గారిచే రూపొందించిన త్రివర్ణ పతాక నమూనా ను1921 మార్చి 31 న విజయవాడ జరిగిన సమావేశంలో మహాత్మా గాంధి గారికి అనేక మంది చుట్టు ప్రక్కన గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి అందించారు,ఆ నమూనా గాంధీకి ఎంతో నచ్చింది,వెంటనే మూడు రంగులతో పాటు రాట్నం మధ్యలో వేయమంటే మూడు గంటలలో రూపొందించి అందజేశారు,అయితే స్వాతంత్ర్యం పొందిన తరువాత రాట్నం స్థానంలో అశోక్ ధర్మ చక్రాన్ని చేర్చి, తెలుపు రంగు శాంతికి చిహ్నంగా,ఆకుపచ్చ రంగు విశ్వాసానికి, కాషాయ రంగు శక్తికి చిహ్నంగా తెలియజేశారు,ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్, వెంకటేశ్వర్ గౌడ్, వెంకట రమణ, లక్ష్మయ్య, రవిశేఖర్, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాసులు, రాధ, లక్ష్మి కాంత రెడ్డి, అల్లిపీరా, లీలావతమ్మ, నూర్జహాన్, శ్రీనివాసులు, సుబ్బారాయుడు,రమేష్, సురేష్, జయసుబ్బారాయుడు, సుభాన్, రాఘవేంద్ర, మధుసూదన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, ఆదినారాయణ, శ్రీకళ, భారతి, మద్దిలేటి, శివన్న, దేవేంద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.