YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దేశంలో కరోనా వైరస్‌ ప్రభావంతో 354 మంది మృత్యువాత

దేశంలో కరోనా వైరస్‌ ప్రభావంతో 354 మంది మృత్యువాత

న్యూఢిల్లీ మార్చ్ 31
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. మరణాలు సైతం భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,480 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 41,280 మంది కోలుకోగా.. వైరస్‌ ప్రభావంతో 354 మంది మృత్యువాత పడ్డారని కేంద్రం పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది.ఇప్పటి వరకు 1,14,34,301 మంది కోలుకోగా.. మొత్తం 1,62,468 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 5,52,566 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా 6,30,54,353 డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు దేశంలో 10,22,915 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పేర్కొంది. మహమ్మారి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 24.36 కోట్ల శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.

Related Posts