YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

ఇండియా వృద్ధి రేటు 10.1 శాతం.. వ‌ర‌ల్డ్ బ్యాంక్

ఇండియా వృద్ధి రేటు 10.1 శాతం.. వ‌ర‌ల్డ్ బ్యాంక్

న్యూఢిల్లీ మార్చ్ 31
వ‌చ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇండియా వృద్ధి రేటు 10.1 శాతంగా ఉండ‌నుంద‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ఎక‌న‌మిక్ ఫోక‌స్ సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్ రిపోర్ట్ వెల్ల‌డించింది. అయితే ప్ర‌స్తుతం కరోనా విష‌యంలో నెల‌కొన్న అనిశ్చితి, విధాన నిర్ణ‌యాల కార‌ణంగా వాస్త‌విక జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 12.5 శాతం మ‌ధ్య ఉండే అవ‌కాశం ఉన్న‌ద‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ అంచ‌నా వేసింది. ఇప్పుడున్న అసాధార‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అంచ‌నాల్లో ఈ భారీ వ్య‌త్యాసం స‌హ‌జ‌మేనని వ‌ర‌ల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ప్రాంత చీఫ్ ఎక‌న‌మిస్ట్ హ‌న్స్ టిమ్మ‌ర్ అన్నారు.సాధార‌ణ ప‌రిస్థితుల్లో వేసే అంచ‌నాల‌ను ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉప‌యోగించ‌లేమ‌ని ఆయ‌న చెప్పారు. గ‌తేడాది మ‌హ‌మ్మారి కార‌ణంగా భారీగా ప‌త‌న‌మైన భారత జీడీపీ చాలా వేగంగా పుంజుకున్నా.. ఇంకా పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక మొత్తం ద‌క్షిణాసియా ప్రాంతంలో 2021లో వృద్ధి రేటు 7.2 శాతంగా, 2022లో 4.4 శాతంగా ఉంటుంద‌నీ ఈ రిపోర్ట్ అంచ‌నా వేసింది.

Related Posts