YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చుపెట్టి ల‌బ్ధి పొండాలని చూస్తున్న ‌కాంగ్రెస్: అమిత్ షా

ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చుపెట్టి ల‌బ్ధి పొండాలని చూస్తున్న ‌కాంగ్రెస్: అమిత్ షా

గువాహ‌టి మార్చ్ 31
‌కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చుపెట్టి ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. రాజ‌కీయా స్వార్థంతో అసోంలో బోడో-నాన్ బోడో, అస్సామీ-బెంగాలీ, హిందూ-ముస్లిం, అప్ప‌ర్ అస్సాం-లోయ‌ర్ అస్సాం, ట్రైబ్‌-నాన్ ట్రైబ్ పేరుతో గొడ‌వ‌లు సృష్టిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. కానీ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నినాదం మాత్రం స‌బ్ కా సాథ్‌, స‌బ్ కా వికాస్‌, స‌బ్ కా విశ్వాస్ అని, త‌మ‌కు హిందూ-ముస్లిం అనే భేద భావాలు లేవ‌ని చెప్పారు.అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బుధ‌వారం అసోంలోని కామ‌రూప్‌లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించిన అమిత్ షా.. త‌మ పాల‌న‌లో హిందూ, ముస్లింలు అంద‌రికీ ఓకే రీతిన ప్ర‌భుత్వ ఫ‌లాలు అందుతాయ‌ని చెప్పారు. తాము ఇంటింటికీ తాగునీరు అందించిన‌ప్పుడు ముస్లింల ఇళ్ల‌కు కూడా తాగునీరు అందుతుంద‌ని, అంద‌రికీ ఇండ్లు ఇచ్చిన‌ప్పుడు ముస్లింల‌కు కూడా ఇండ్లిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.అసోంలో బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. మైనారిటీలు, గిరిజ‌నులు, బోడోలు అనే తార‌త‌మ్యాలు లేకుండా అన్ని వ‌ర్గాల రైతుల‌కు ఒకేర‌కంగా రూ.10,000 చొప్పున అంద‌జేస్తామ‌ని అమిత్ షా ప్ర‌క‌టించారు.

Related Posts