YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జోరుగా కొనసాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్

జోరుగా కొనసాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్

ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతుండడంతో నగరాలు, పట్టణాలే కాక..పలు గ్రామాల్లో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. బెట్టింగ్‌ రూపంలో రోజు లక్షలాది రూపాయలు చేతులు మారు తున్నాయి. చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన వారు పట్టణంలో అపార్ట్‌మెంట్లు, లాడ్జిలు, పట్టణ శివారు ప్రాంతంల్లో గదులు అద్దెకు తీసుకొని బెట్టింగులు నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కొందరు మహిళలను రప్పించి వ్యభిచారం కూడా సాగిస్తున్నట్లు వినికిడి. మద్యం మత్తులోనూ జోగాడుతున్నారు. టెక్నాలజీ ఆభివృద్ది చెందడంతో బెట్టింగులు నిర్వహణ మరింత సులభతరమైంది. గతంలో టివిలు, సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాబ్‌ ద్వారా బెట్టింగులు నిర్వ హించేవారు. ఇప్పుడు వాట్సాప్‌, వీడియో కాల్స్‌, ఐపిఎల్‌ కోసం ప్రత్యేక యాప్‌లు రావడవతో బెట్టింగ్‌ రాయుళ్ళకు మరింత సులభమైంది. ఆన్‌లైన్‌ ఆకౌంట్‌ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారుబంతి బంతికీ, ప్రతి షాట్‌కు, ప్రతి ఓవర్‌కు బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.ఐపిఎల్‌ పేరుతో లక్షలాది రూపాయల బెట్టింగులు జరుగుతున్నా పోలీస్‌ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బెట్టింగుల కారణంగా తమ పిల్లల జీవితాలు గుల్ల అవుతున్నాయని తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆధికారులు స్పందించి బెట్టింగులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఐపిఎల్‌ కారణంగా చాపకింద నీరులా క్రికెట్‌ బెట్టింగ్‌ సాగుతోంది.నిరుద్యోగ యువత దీని కారణంగా నష్టపోతున్నారు. ఈ వ్యవహారం నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది. నలుమూలలా తిష్టవేసిన కొందరు  యువతను వక్రమార్గం పట్టిస్తున్నారు. చాప కింద నీరులా పలు జిల్లాల్లో  క్రికెట్‌ బెట్టింగ్‌ విస్తరిస్తోంది. రహస్యంగా ఉన్నత వర్గాలకు చెందిన వ్యాపారులు పోలీసుల కళ్లు గప్పి ఈ తంతును యథేచ్ఛగా నడిపిస్తున్నారు ఈ మోజులో పడి లక్షల రూపాయల్ని పోగొట్టుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో  బెట్టింగులుజోరందుకుంటున్నాయి. రాత్రికిరాత్రే లక్షాధికారులు కావాలన్న ఆకాంక్ష యువతను పెడదోవ పట్టిస్తోంది. క్రమక్రమంగా గ్రామాల్లోనూ ఈ తీరు విస్తరిస్తోంది. సరదాగా కొనసాగుతున్న భావన కొందరి జీవితాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కారణమవుతోంది.రూ.10, రూ.50 మొదలు వందలు వేల రూపాయలకు ఇది విస్తరిస్తోంది. సరదాకు అని కొందరు.. ఇదో పసందు అని మరికొందరు ఈ వికృత క్రీడకు బానిసవుతున్నారు. పందెం వల్ల ఆర్థికంగా నష్టపోయినవారు కిమ్మనకుండా ఉంటున్నారు. లాభాలు గడించినవారు మరికొందరికి ఎర చూపుతూ ఈ తరహా జల్సాకు బానిసలుగా మారుస్తున్నారు. గెలిచినవారికి తొలుత నయాపైసలతో సహా కచ్చితంగా చెల్లిస్తారు. బెట్టింగ్‌ రుచి మరిగిన తరువాత గెలిచినా డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరగడం, ఇతరులతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, అవసరమైతే దౌర్జన్యాలకు దిగుతున్నారు. వీటన్నింటికీ ఈ బెట్టింగ్‌ వ్యవహారమే కారణమవుతోంది.ఫోన్లల్లో కోడ్‌ భాషతోపాటు నేరుగా వ్యక్తుల మధ్య పొడిమాటలతోనే ఈ పందాలను కొనసాగిస్తున్నారు. ఎక్కువగా స్నేహితులు. బాగా తెలిసిన వ్యక్తుల మధ్య ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఏదో తరహాలో పని ఒత్తిడి సహా ఇతర కేసుల విషయంలో తీరిక లేకుండా ఉంటున్న పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జిల్లాల్లో చిరు వ్యాపారాల్లో యువతనే అధికంగా ఉంటున్నారు. క్రికెట్‌పై ఉన్న వ్యామోహం మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేస్తోంది. రోజంతా కష్టపడిన దానికి క్షణాల వ్యవధిలో రెండింతల సొమ్ము వస్తుందనే సాకుతో పందెం కాస్తున్నారు.  సర్వం కోల్పోతూ అప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా మ్యాచ్‌ల తీరుని బట్టి బెట్టింగ్‌ జోరు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెండు పెద్ద జట్ల మధ్య జరిగే హోరాహోరీ పోరు అధిక ప్రభావం చూపిస్తోంది. ఒకటి పెద్ద జట్టు, రెండవది చిన్న జట్టు ఉన్న సమయంలోనూ పరుగుల విషయంలో ఎక్కువ బెట్టింగ్‌ కాస్తున్నట్లు తెలుస్తోంది. రెండు జట్లలోని బ్యాట్స్‌మన్‌ల వారీగా.. బంతి బంతికి, టాస్‌ల వారీగా ఈ తీరు మారుతున్నట్లు సమాచారం. చివరి ఓవర్లలో బెట్టింగ్‌ని ఎక్కువగా కాస్తున్నారు.  పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి రహస్య ఒప్పందాల్ని నిగ్గు తేలిస్తే ఈ వ్యాపకం తగ్గే అవకాశముంది. ఆర్థికంగా, మానసికంగా దెబ్బతినకుండా  బెట్టింగ్‌ను వీలైనంత తొందరగా కఠినంగా అణిచివేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.హైదరాబాద్ లో బెట్టింగ్ దశాబ్ధాలుగా కొనసాగుతుంది. ఈ సారి  బుకీలు ఎక్కడ తగ్గటలేదని తెలుస్తుంది.నగరంలోని హోటల్లు,గెస్ట్ హౌస్ లో నగర శివారులోని ఫామ్ హౌస్ లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు దగ్గర సమాచారం ఉంది.నగరంలోని లక్డికాపుల్ ,మొజాంజాహీం మార్కెట్,బేగం బజార్ ,సికింద్రబాద్ లోని రెయిన్ బజార్ ,ఆర్ పి రోడ్ లోని ప్రముఖ హోటల్లో బెట్టింగ్ జరుగుతుందని సమాచారం.గుజరాత్ మహరాష్ట్ర లకు చెందిన కొందరు బుకీలు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారని తెలుస్తో్ంది.ఒక మ్యాచ్ కు కోట్లలో బెట్టింగ్ జరుగుతుంది.ఒక మ్యాచ్ ద్వారా చిన్న బుకీలే కోట్లు సంపాదిస్తున్నారంటే ఇక బడా బుకీలు ఎంత సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మే 14న ధర్మాసనం ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పోలీసుల దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు విచారణకు కూడా కోటం శ్రీధర్‌రెడ్డి సహకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యేపై 173, 174 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధర్మాసనం ముందు హాజరుకావాలని ఆదేశించింది.నిజామాబాద్ జిల్లాలో ఐపిఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. న‌గ‌రాల‌కు ప‌రిమిత‌మైనా ఈ బెట్టింగ్ ప్రజెంట్  గ్రామాల‌కు కూడా పాకింది.. జిల్లా కేంద్రంతో పాటు ప‌ట్టణాల్లో బెట్టింగ్ ముఠాలు ఈ దందాను నిర్వహిస్తున్నాయి.  మ్యాచ్ కే కాకుండా బంతి బంతికి , ఓవ‌ర్ ఓవ‌ర్ కు రేట్లు మార్చుతూ ల‌క్షలు కొల్లగొడుతున్నారు.. నిజామాబ‌ద్ జిల్లాలో వారం రోజుల వ్యవ‌ధిలోనే రెండు గ్యాంగ్ లను అరెస్ట్ చేశారు పోలిసులు.. మ‌ద్యత‌ర‌గ‌తి యువ‌త‌ను టార్గెట్ చేస్తూ ఈ బెట్టింగ్ జ‌రుగుతుంద‌ని పోలిసులు చెబుతున్నారు..బోధన్ పట్టణం లోని రాకసిపెట్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న 5 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి లక్షా 63 వేలు నగదు, 11 సెల్ ఫోన్స్, ఒక లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ శ్రీధర్ రెడ్డి  మీడియాకు వెల్లడించారు..అమయకులని వలలో వేసి బెట్టింగ్ లోకి దింపితున్న వారిపై జాగ్రత్త గా ఉండాలని సూచించారు ఆయన.. జిల్లా వవ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు చిత్తురు జిల్లా మదనపల్లి

 

మదనపల్లెలో ఐ.పి.ఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పపడుతున్న పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  మదనపల్లె 1 టౌన్, రూరల్ పోలీసులు చేసిన విస్తృత దాడుల్లో 78 వేల రూపాయల నగదు, పలు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 1 టౌన్ పోలీసు స్టేషను లో డి.ఎస్.పి. చిదానందరెడ్డి,ట్రైనీ ఎస్.పి. సతీష్ కుమార్,సి.ఐ.నిరంజన్ కుమార్ ల ఆద్వర్యంలో అరెస్టు చేసిన నిందితులను స్వాధీనం చేసుకున్న నగదు,సెల్ ఫోన్ లను మీడియా చూపించారు. కర్నూలు నగరంలో ని పాతబస్తీలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 8 మంది బుకీలను  పోలీసులు అరెస్టు చేశారు. వారిదగ్గర నుండి 6,44,000 నగదు, కంప్యూటర్ తో పాటుగా లాప్ టాప్ బాక్స్ లు ఏటీఎం కార్డుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలో ని సోహైల్ ఇంట్లో అదేవిధంగా మల్లికార్జున గౌడ్ అనే వెక్తి తన ఆఫీస్ లో బెటింగ్ కు పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ లో గెలుపు ఓటమీ లపై బెట్టింగ్ కాస్తున్నారన్నారు. సోషల్ మీడియాను వినియోగించుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. 

Related Posts