YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల నిర్వహాణలో సంతృప్తి నీలం సాహ్నీకి శుభాకాంక్షలు

ఎన్నికల నిర్వహాణలో సంతృప్తి నీలం సాహ్నీకి శుభాకాంక్షలు

అమరావతి
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. గురువారం పదవి విరమణ చేయనున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవి విరమణ కు ముందు గవర్నర్ ను కలవలనుకున్న ఆయన వాక్సినేషన్ వేసుకుంటున్నందున నిన్న, నేడు అప్పోయింట్మెంట్ దక్కలేదు. రాగానే ఆయన్ను కలుస్తానని అన్నారు. నా వారసురాలిగా వస్తున్న నీలం సాహ్ని కి శుభాకాంక్షలుని అన్నారు. ఎన్నికల నిర్వహణ కు మీడియా అందించిన సహకారం కు ధన్యవాదాలు. ఎన్నికల నిర్వహణ పట్ల నేను పూర్తి సంతృప్తి గా ఉన్నా. రీపోల్ కూడా లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుంది. స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయి లో ఈ ఎన్నికలు నిర్వహించాం. ఇవన్నీ ప్రభుత్వం నుండి సీఎస్ నుండి పూర్తి సహకారం లభించింది. మీడియా ద్వారా సి ఎస్ కు సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. వ్యవస్థల మధ్య అంతరాలు అనవసరంగా వచ్చాయి. ఎన్నికల సిబ్బందిని సెలవుల్లో వెళ్లమన్నారు. దీన్ని వెంటనే చక్కదిద్దాం. నా వోట్ తెలంగాణ లో రద్దు చేసుకుని నా గ్రామం లో వోట్ అడిగాను అది నిరాకరించడం వల్ల టీ కప్పులో తుఫాను గా మారింది. ఇంకా నా వోట్ హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్ లో ఉంది. వోట్ హక్కు కోసం హైకోర్టు కు వెళతా, పోరాటం చేస్తాను. ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక వ్యాఖ్య లు చేసాయి. ఎన్నికల కమిషన్  ఒక రాజ్యాంగ వ్యవస్థ. 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించింది. ఎన్నికల కమిషన్ ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకోకూడదు. వాటికి గౌరవం ఇవ్వాలి. వ్యవస్థల పై నాకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. నామినేషన్ వెయ్యనివ్వలేనప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేసామని అయన అన్నారు.
 

Related Posts