YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

3 టీలపై దృష్టి పెట్టండి

3 టీలపై దృష్టి పెట్టండి

హైదరాబాద్, మార్చి 31, 
రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేప‌థ్యంలో టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీటింగ్ ప‌ద్ధ‌తిని అధికారులు క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. కరోనా కేసుల పెరుగుదల, చికిత్స పై వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి బుధ‌వారం ఫోన్‌లో మాట్లాడారు. కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సంద‌ర్భంగా నిర్ణయించారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్ప‌త్రుల సూపరింటెండెంట్లు, నోడల్ అధికారుల‌తో సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచాల‌ని సూచించారు.కేసుల సంఖ్య పెరుగుతున్న కూడా తీవ్రత తక్కువగా ఉంద‌ని అధికారులు మంత్రికి వివరించారు. వాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుందని, అయితే అందరికీ వాక్సిన్ అందించడానికి అవసరమైన డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కోరిన‌ట్లు ఈట‌ల తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్ తప్పని సరిగా ధరించాలని కోరారు. భౌతికదూరం పాటించాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దన్నారు.

Related Posts