YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

కేసీఆర్ వ్యాఖ్యాలపై మండిపడ్డ టీపీసీసీ నేతలు

కేసీఆర్ వ్యాఖ్యాలపై మండిపడ్డ టీపీసీసీ నేతలు

మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ కెసిఆర్ మాట్లాడుతూ జనారెడ్డి కి పరిమినేట్ రెస్ట్ ఇస్తాను అని అన్నారు..మెము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం జానారెడ్డి. జానారెడ్డి కి సీఎం పదవి ఆఫర్ ఇచ్చిన తీసుకోలేదు. నాకు సీఎం పదవి ఇస్తే తెలంగాణ రాదు అని చెప్పారని అన్నారు.
జనారెడ్డి ఇన్నేళ్ల రాజకీయంలో కొడుకులని కానీ కుటుంబ సబ్యులని ఎవరని రాజకీయాల్లోకి తీసుకురాలేదు. కెసిఆర్ కుటుంబంలో అందరకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. నిన్న కెసిఆర్ పామ్ హౌస్ లో ఆరు మండలాలకు మండలానికి ఐదు కోట్లు ఇచ్చారు. నాగార్జునసాగర్ ఎన్నికలో 100 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. జనారెడ్డి పెట్టిన బిక్ష తో కెసిఆర్ సీఎం అయ్యారు.  ఆనాడు కెసిఆర్ జానారెడ్డి సీఎం అయితే నీవు ఎక్కడ వుండేవాడివి కెసిఆర్. జానారెడ్డి మచ్చ లేని నాయకుడు. జానారెడ్డి పై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి. కాగ్ రిపోర్ట్ తెలంగాణ ప్రభుత్వం మీద సీరియస్ అయిందని అన్నారు.
కాంగ్రెస్ చెపితే మీరు ఆరోపిస్తున్నారు అన్నారు. పదివేల కోట్ల స్కాం జరిగింది అని కాగ్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ వేసి..ఏ డిపార్ట్మెంట్స్ లో అవినీతి జరిగిందో. దేశం లోని ఏ రాష్ట్రంపై కూడ కాగ్ ఇంత స్థాయిలో  ఎలిగేషన్ చేయలేదని అన్నారు. అప్పులు తీసుకొచ్చి రెవెన్యూ అని చెపుతున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల కోట్లపైనే అప్పులు చేసారని అన్నారు.
మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ జానారెడ్డి పై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలని మెము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల తరువాత కెసిఆర్ శాశ్వతంగా పామ్ హౌస్ కె పరిమితమయ్యారు. జానారెడ్డి సీఎం పదవి తీసుకుంటే తెలంగాణ రాదు అని అ పదవిని త్యాగం చేసారు. రాజకీయాలకే జానారెడ్డి ఒక దీక్షుచి లాంటి వారు. జానారెడ్డి కి యూనానిమాస్ గా ఎమ్మెల్యే ఇచ్చి ఆయన్ని గౌరవించాల్సింది కెసిఆర్. కెసిఆర్ మీ మాటలు , మి డబ్బు జానారెడ్డి ముందు పని చేయవు. కెసిఆర్ రాజకీయ పతనం దుబ్బాక లో ప్రారంభమైంది. నాగర్జున సాగర్ ఎన్నిక తరువాత నిజమైన రాజకీయ పునరేకీరణ జరుగుతుందని అన్నారు.
 

Related Posts