YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మలుపులు తిరుగుతున్న జయడీఎన్ఏ కేసు

మలుపులు తిరుగుతున్న జయడీఎన్ఏ కేసు

కొందరు వ్యక్తులు ఎక్కడున్న, ఏ పని చేస్తున్న ఎప్పుడు వార్తల్లో ఉంటారు. బ్రతికున్న చివరకు చనిపోయిన వాళ్ళ గురించి వార్తలు ఏదో ఒక మ్యాటర్ లో వస్తునే ఉంటాయి. అలాంటి వారిలో జయలలిత ఒకరు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన డీ.ఎన్‌.ఏ పరీక్ష కేసు మరో మలుపు తిరిగింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళ తాను జయలలిత సొంత కూతుర్ని అని చాలా రోజుల నుంచి చెప్తున్న మాట మనం మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.  ఐతే గతంలో ఆమె  డీఎన్‌ఏ పరీక్షకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు లో పిటిషన్‌ వేయగా ,సుప్రీంకోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లమని చెప్పింది. దీంతో ఆమె మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.మద్రాస్‌ హైకోర్టులో   పిటిషన్‌ను  పై   విచారణ కొనసాగుతుంది. 2016 లో జయలలిత అనారోగ్యంతో హస్పిటల్లో చేరినప్పుడు ఆమెకు సంబంధించిన బయోలాజికల్‌ శాంపుల్స్‌ ఏవైనా సేకరించి ఉంచారా.. లేదా.. అనే విషయంపై సమాచారం ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు, అపోలో హస్పిటల్ ను ఆదేశించింది. దీంతో హస్పిటల్లో తమ వద్ద జయలలితకు సంబంధించిన బయోలాజికల్‌ శాంపుల్స్‌ ఏమీ లేవని కోర్టుకు అపోలో హస్పిటల్ యాజమాన్యం చెప్పింది. ఆ మహిళ జయలలిత కూతురు అవునో కాదో దేవుడికే తెలియాలి కానీ, తను జయ కూతురు అని ప్రూవ్ చేసుకునే ఆధారం మాత్రం తనకు ఇప్పుడు దొరకలేదు.

Related Posts