ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో 30964 మందికి పరీక్షలు జరిగాయి. కొత్తగా 1184 కేసులు నమోదు, పాజిటీవ్ తో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 352 కేసులు నమోదు అయ్యాయి.
విశాఖపట్నం లో 186, చిత్తూరులో 115, కృష్ణాలో 113 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటీవ్ కేసులు 9,01,989. రాష్ట్రంలో రికవరీ కేసులో 8,87,43. యాక్టీవ్ కరోనా కేసులు 7,338. మొత్తం కరోనాతో మృతి చెందిన వారు 7,217