మచిలీపట్నం చిలకలపూడి సెంటర్ నందు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహం వద్ద నేటితో జాతీయ పతాకాన్ని రూపొందించింది శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ మహనీయునికి మచిలీపట్నం ఆర్డిఓ ఖాజావలి, బిజెపి రాష్ట్ర నాయకులు పంతం వెంకట గజేంద్ర, జనసేన అధికార ప్రతినిధి లంకి శెట్టి బాలాజీ, జన జాగృతి సంస్థ కన్వీనర్ కాళిదాసు రిటైర్డ్ ఆర్మీ కమాండర్ హుస్సేన్ మచిలీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మచిలీపట్నం ఆర్.డి.ఓ ఖాజావలి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అనుచరుల్లో ఒకరైన పింగళి వెంకయ్య కృష్ణాజిల్లా మచిలీపట్నం నివాసి కావడం మన ప్రాంత అదృష్టమని ఆ మహనీయుని చేతుల మీదుగా జాతీయ పతాకం రూపొందించి గాంధీజీ మన్ననలు పొందారని. దేశ ప్రజల ఆకాంక్షలను గర్వపడే విధంగా జాతీయ జెండా రూపొందించి నేటితో శత వసంతాలు కావటంతో హృదయ పూర్వకంగా నివాళులు అర్పించి మనం ఆయనకి ఇచ్చే గౌరవం అని తెలుపరు. దేశంలో మరియు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుండెలో చిరస్థాయిగా నిలచిపోయారని తెలిపారు.
బిజెపి రాష్ట్ర నాయకుడు గజేంద్ర మాట్లాడుతూ జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు ఘనంగా నివాళులు అర్పించామని, కేంద్ర ప్రభుత్వo భారత రత్న ఇవ్వాలని అందుకు రాష్ట్ర చొరవ తీసుకుని కృషి చేయాలని సూచించారు. ప్రపంచంలో నే భారత దేశ జాతీయ జెండా కు అరుదైన ఘనత ఉందని తెలిపారు. అనంతరం ఆర్మీ రిటైర్డ్ కమాండర్ హుస్సేన్ను దు శాలువాతో సత్కరించి పింగళి వెంకయ్య చిత్రపటాన్ని అందించారు.