YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి కోసం బీజేపీ బడా నేతలు

 తిరుపతి కోసం బీజేపీ బడా నేతలు

తిరుపతి, ఏప్రిల్ 1, 
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఏపీలో తిరుపతి బై ఎలక్షన్ జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ ఉప ఎన్నికల్ని సవల్‌గా తీసుకుంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. అటు ఏపీలో కూడా పాగా వేయాలని భావిస్తోంది. అందుకే తిరుపతి ఉప ఎన్నికలో కమలం పార్టీ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.అందుకే ఏపీలో కూడా తిరుపతి ఉప ఎన్నిక కోసం తెలంగాణ నుంచి నాయకుల్ని ప్రచారం కోసం రంగంలోకి దింపుతోంది. తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏప్రిల్‌ 3న తిరుపతిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం... పవన్ పాదయాత్ర చేయనున్నారు. పవన్ పర్యటన ఖరారు కావడంతో జనసేన-బీజేపీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.దీంతో తెలంగాణ బీజేపీ నేతలు కూడా తిరుపతి ఉపఎన్నిక కోసం ప్రచారంలో పాల్గొనున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున తెలంగాణ నేతలు రానున్నారని సమాచారం. ఏప్రిల్ 4న రాజాసింగ్, ఏప్రిల్ 5న రఘునందన్ రావు తిరుపతి వెళ్లనున్నారు. ఏప్రిల్ 8న నిర్మలా సీతారామన్ రానుండగా, ఏప్రిల్ 10న జేపీ నడ్డా, 14 న బండి సంజయ్ సైతం తిరుపతిలో పర్యటించి ప్రచారం నిర్వహిచంనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఇక వైసీపీ తరపున గురుమూర్తి, టీడీపీ తరపున పనబాక లక్ష్మీ సైతం తిరుపతి బై ఎలక్షన్‌ బరిలోకి దిగారు. దీంతో ఆయా పార్టీల నేతలు సైతం అక్కడ ప్రచారం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.

Related Posts