న్యూఢిల్లీ ఏప్రిల్ 1,
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు కేంద్ర ప్రభుత్వం గురువారం 2019 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. అవార్డు ప్రకటించిన జ్యూరీలో గాయకురాలు ఆశా భోంస్లే, నిర్మాత దర్శకుడు సుభాష్ ఘాయ్, మలయాళ సుపర్ స్టార్ మోహన్ లాల్, గాయకుడు శంకర్ మహదేవన్, బిస్వజిట్ చట్టర్జీలు సభ్యులుగా వున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ మాట్లాడుతూ భారత సినిమా రంగంలో గొప్ప నటుడు రజనీకాంత్ కు ఈ అవార్డు ప్రకటించడం సంతోషంగా వుందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ లో రజనీకాంత్ ను ప్రశంసించారు.అసాధారణ నటనా పటిమ అయనకు సొంతం. వివిధ పాత్రల పోషణలో అయనకు అయనే సాటని అన్నారు. తలైవాకు ఈ అవార్డు రావడంతో అయన శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని సెల్వం రజనీకి ఫోన్ చేసి అభినందించారు.
మరోవైపు, తమిళనాడు ఎన్నికల్లో కొద్దిరోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఇప్పుడే రజనీకాంత్ కు ఈ అవార్డు రావడం పట్ల పలువురు ప్రశ్నించారు. ఇప్పుడే అయన ఎందుకు గుర్తొచ్చాడని కేంద్రంలోని బీజేపీ సర్కారును ప్రశ్నిస్తున్నారు. ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడ ఇది వారంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల జిమ్మిక్కు అంటూ విమర్శలు చేస్తున్నారు.