న్యూఢిల్లీ, ఏప్రిల్ 1
ఆధార్‌తో పాన్ అనుసంధాన గడువు బుధవారంతో ముగియడం తో ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. మార్చి 31తో ముగిసిన గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందుల దృష్ట్యా పాన్‌తో ఆధార్ అనుసంధాన గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు(సీబీడీటీ) తెలిపింది. ఆధార్‌తో పాన్‌ను గడువులోపు అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పని చేయదు. మార్చి 31 వరకు ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేయకపోతే రూ.1,000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉం టుందని కేంద్రం ఇటీవలే హెచ్చరించింది.