YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

స్త్రీ..పురుష అసమానతల్లో దారుణంగా పడిపోయిన భారత్ రికార్డు

 స్త్రీ..పురుష అసమానతల్లో దారుణంగా పడిపోయిన భారత్ రికార్డు

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 1
అందరి నోళ్లను మూయించలేం. అన్నింటికి మించి అంతర్జాతీయ నివేదికల్ని మార్చలేం. నిత్యం నీతులు వల్లించే మోడీ పాలనలో దేశంలో జెండర్ గ్యాప్ ఎంత భారీగా పెరిగిపోయిందన్న విషయం తాజాగా వెల్లడైన నివేదిక కళ్లకు కట్టినట్లుగా కనిపించే చేసింది. స్త్రీ.. పురుష అసమానతల్లో భారత్ రికార్డు మరింత దారుణంగా మారిన వైనం తాజాగా వెల్లడైంది. ప్రపంచ ఆర్థిక నివేదిక వెల్లడించిన నివేదిక ప్రకారం భారత్ లో జెండర్ గ్యాప్ 62.5 శాతంగా పేర్కొన్నారు.ఆర్థిక భాగస్వామ్యం..అవకాశాల్లో కూడా అంతరం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మహిళా మంత్రుల సంఖ్య దారుణంగా పడిపోయింది. 2019లో 23.1 శాతంగా ఉన్న మహిళా మంత్రులు 2020 నాటికి 9.1 శాతానికి పడిపోయింది. మొత్తం 156 దేశాల్లో భారత్ ర్యాంకు 140గా ఉంటే.. మన ఇరుగుపొరుగు దేశాల ర్యాంకులు మరింత మెరుగ్గా ఉండటం గమనార్హం. ఇటీవల ప్రధాని మోడీ పర్యటించిన బంగ్లాదేశ్ విషయానికే వస్తే.. ఆ దేశం జెండర్ గ్యాప్ లో 65వ ర్యాంకులో నిలిచి.. మన కంటే ఎంతో మెరుగ్గా ఉంది.అంతేనా.. మనకంటే చిన్నదేశాలైన నేపాల్ 106వ ర్యాంకులో ఉంటే.. శ్రీలంక 116వ ర్యాంకులో ఉన్నట్లు వెల్లడైంది. ఒక బుజ్జి దేశమైన భూటాన్ సైతం 130 ర్యాంకులో నిలిచింది. సీనియర్ మేనేజర్ పదవుల్లో మహిళల వాటా కేవలం 14.6 శాతంగా పడిపోయింది. ఆదాయంలోనే అసమానతలు పెరిగిపోయాయని.. పురుషులు ఆర్జించే ఆదాయంలో అయిదింట ఒకవంతు  మాత్రమే మహిళలు పొందుతున్నట్లుగా వెల్లడైంది. ఈ విషయంలో ప్రపంచ సూచీలో భారత్ అట్టడుగు పదో స్థానంలో నిలిచినట్లుగా నివేదిక వెల్లడించింది. ఆరోగ్యం.. మనుగడ అంశాల్లోనే ఇదే రీతిలో దారుణ వివక్ష సాగుతుందని వెల్లడించింది.

Related Posts