YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పోత్తు వుండదు..ఒంటరిగానే పోటీ బండి సంజయ్

పోత్తు వుండదు..ఒంటరిగానే పోటీ బండి సంజయ్

హైదరాబాద్
2023 లో భాజపా అధికారంలోకి వచ్చేందుకు యువ మోర్ఛా కార్యకర్తలు పని చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తోంది. యువ మోర్ఛా చేపట్టబోయే కార్యాచరణ చరిత్రలో నిలిచిపోయేలా రూపొందించాలి. యువ మోర్ఛా ఉద్యమంతో కేసీఆర్ కు వణుకు పుట్టాలి. సిద్దాంతం కోసం పని చేస్తాం తప్పితే...కేసులకు భయపడం. దేశం గురించి ఏ రాజకీయ పార్టీ ఆలోచించడం లేదు. యువ మోర్ఛా కార్యకర్తలకు క్రమశిక్షణ, ఓపిక ముఖ్యం. రాష్ట్రంలోని పేద ప్రజలకు న్యాయం జరగాలంటే భాజపా అధికారంలోకి రావాలని అన్నారు.
2023ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదు...ఒంటరిగానే పోటీ చేస్తాం. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. ఉద్యోగాలు భర్తీ చేసే టీఎస్పీఎస్సిలొనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టభద్రుల ఎన్నికల్లో మేధావులు తీసుకున్న నిర్ణయం బాధ కల్గించింది. అనేక విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు, మౌలిక సదుపాయాలు లేవు. నాగార్జున సాగర్ జనరల్ స్థానంలో ఎస్టీ సామాజిక వర్గానికి టిక్కెట్ కేటాయించిన ఘనత భాజపాకే దక్కుతుంది. అసెంబ్లీ నడపాలంటే కూడా ప్రభుత్వం యువ మోర్ఛాను చూసి భయపడుతుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే విధంగా ప్రజలను యువ మోర్ఛా చైతన్యవంతం చేయాలని అయన సూచించారు.

Related Posts