YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇండియా ఫస్ట్ పీఎం మోడీ గూగుల్ సెర్చ్ ఇంజన్ పిచ్చి

ఇండియా ఫస్ట్ పీఎం మోడీ గూగుల్ సెర్చ్ ఇంజన్ పిచ్చి

గూగుల్ సెర్చ్ ఇంజిన్ నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. ఇండియా తొలి ప్రధాని (ఫస్ట్ పీఎం) అని గూగుల్ సెర్చ్ బార్‌లో కొడితే వచ్చే ఫొటో చూస్తే అవాక్కవ్వాల్సిందే. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని వివరాలు సరిగానే చూపిస్తున్నా.. ఫొటో మాత్రం ప్రస్తుత ప్రధాని మోదీది చూపిస్తోంది. అంతేకాదు.. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ అని సెర్చ్ చేసినా.. అరున్ జైట్లీ, నిర్మాలా సీతారామన్ ఫొటోలు వస్తున్నాయి. పక్కన మాత్రం షణ్ముఖం షెట్టి, బల్‌దేవ్ సింగ్ అని సరైన వివరాలే చూపిస్తున్నాయి. ఇండియా ఫస్ట్ లేడీ పీఎం అని సెర్చ్ చేసినా.. మోదీ ఫొటోనే వస్తుండటంతో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.గూగుల్‌లో చోటుచేసుకున్న ఈ తప్పిదంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఈ అంశం వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ ప్రతినిధి దివ్య స్పందన స్పందించారు. గూగుల్‌ ఇండియా.. ఏ అల్గారిథమ్ ప్రకారం ఇలా చేసింది? అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. కొన్ని జాతీయ ఛానెళ్లలో ఈ తప్పిదంపై కథనాలు ప్రసారం అయ్యాయి.

Related Posts