గుంటూరు, ఏప్రిల్ 1,
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని భారత్‌పేట 140వ వార్డు సచివాలయంలో సీఎం జగన్, సతీమణి భారతిలు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం.. వైద్యుల పర్యవేక్షణలో అరగంటపాటు అక్కడే ఉననారు. అక్కడ సచివాలయం, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సమావేశమమయ్యారు. అలాగే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సీఎం కోరారు. 4 నుంచి 6 వారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అలాగే వీలైనంత త్వరగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎస్ఈసీని కోరారు. ఎన్నికల కమిషనర్.. సీఎస్, డీజీపీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైన రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్లుగా విభజించి ఈ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని సూచించారు.వ్యాక్సినేషన్ యజ్ఞంలా చేస్తామన్నారు సీఎం. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌పై వాలంటీర్లు అవగాహన కల్పిస్తారని.. ఇంటింటికీ వెళ్లి 45ఏళ్లు దాటిన వారి వివరాలు సేకరిస్తారన్నారు. ఏ రోజు వ్యాక్సినేషన్ జరుగుతుందో ముందుగానే వాలంటీర్లు చెబుతారరి,. ప్రతి మండలంలోని గ్రామ సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. 104, 108 వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని.. వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు ఇచ్చిన వివరాల మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతందన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ముందుకు రాకుంటే వారి ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్ ఉపయోగాలు వాలంటీర్లు వివరిస్తారన్నారు.