YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

రైతులు గుండేనిబ్బరంతో బ్రతికే పరిస్థితి కేవలం తెలంగాణాలో మాత్రమే ఉంది - రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్

రైతులు గుండేనిబ్బరంతో బ్రతికే పరిస్థితి కేవలం తెలంగాణాలో మాత్రమే ఉంది - రాష్ట్ర సంక్షేమశాఖ  మంత్రి కోప్పుల ఈశ్వర్

దేశంలో ఎక్కడ వెతికిన దోరకని రీతిలో రైతుల ఆర్థికంగా వృద్ది లక్ష్యంతో రాష్ట ముఖ్యమంత్రి  తీసుకువస్తున్న కార్యక్రమాల ద్వారా రైతులు గుండెమీద చేయివేసుకుని నిబ్బరంగా బ్రతికే పరిస్థితి కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని   రాష్ట్ర సంక్షేమశాఖా మంత్రి  కోప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం గొల్లపెల్లి మండలంలో దాదాపు 33.63 లక్షలతో రైతువేధిక, సిసిరోడ్డు, వివిధ సంఘభవనాల పారంబోత్సవం, 119 మంది లబ్దిదారులకు కోటి 19లక్షల 13వేల  కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమాలలో మంత్రివర్యులు ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణాలో ప్రవేశపెడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాల ద్వారా దేశాలకే ఆదర్శంగా నిలిచి, పాఠాలు నేర్పెస్థాయిలో తెలంగాణ నిలిచిందని పేర్కోన్నారు.  పల్లేలు గొప్పగా ఎదిగిన నాడే గ్రామస్వర్యాజ్యం సిద్దిస్తుందనే మహత్మాగాంధీ గారిని మాటలను తూచాతప్పకుండా వాటిని నిజం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతం అయిందని అన్నారు.

 

పల్లెప్రగతి కార్యక్రమాల గ్రామాల ద్వారా గ్రామ రూపురేఖలను మార్చివేసిందని, చనిపోయిన వారికి దహనసంస్కారాలు నిర్వహించడానికి చేయడానికి సరైన స్థలం లేని దుస్థితిని నుండి ప్రతిగ్రామానికి ఒక వైకుఠదామాన్ని నిర్మించుకోవడం జరుగుతుందని,  జిల్లాలో 380 కిగాను 367 వైకుఠదామాలను పూర్తిచేసుకోవడం జరిగిందని, డంపింగ్ యార్డులు ఏర్పాటుచేయడం జరుగుతుందని, మంచినీటికి సమస్యకు శాస్వత పరిష్కారాన్ని చూపించి, గోదావరి నుండి రిజర్వాయర్, పైపులైన్ల  ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని,  మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసామని,  ప్రదాన రహదారి 66 ఫీట్ల వెడల్పు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను పూర్తిచేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్ తో రోడ్డు నిర్మాణలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కోన్నారు.

సంఘభవనాల నిర్మాణాలు పూర్తిచేసుకోవడం జరిగిందని,  మండల కేంద్రంలో విద్యూత్ సమస్యల పరిష్కారం కొరకు విద్యూత్ శాఖవారిచే స్పెషల్ రిపేరింగ్ సెంటర్ ను మంజూరు చేసుకోవడం జరిగిందని పేర్కోన్నారు.  గ్రామాలలో పల్లెప్రగతి కార్యక్రమంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పల్లెప్రగతితో గ్రామవికాసం కార్యక్రమం ద్వారా ప్రతిగ్రామంలో చేపట్టిన, చేపట్టవలసిన పనులను పరిశీలించి నివేధికను తయారు చేసి ప్రాదాన్యత క్రమంలో పనులను పూర్తిచేయడం జరుగుతుందని, నాయకులు గ్రామంలో పర్యటిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బాద్యతగా వ్యవహరిస్తూ,  ప్రజల కొరకు నిజాయితిగా, పట్టుదలతో కృషిచేయాలని అన్నారు.

దేశం మొత్తంమీద గ్రామాల అభివృద్దిలో 12 అవార్డులను భారతప్రభుత్వం ప్రకటించిదని, అందులో కోరుట్ల మండలానికి 1, దర్మారం మండలానికి  2 అవార్డులు పొందడం జరిగిందని, అవార్డులతో పాటు 25లక్షలరూపాయలు గ్రామ అభివృద్ది కొరకు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు.  ఈ సందర్బంగా కృషిచేసిన జిల్లా కలెక్టర్, జిల్లాపరిషత్ చైర్మన్ అభినందించారు.  
రైతులు గుండేనిబ్బరంతలో బ్రతికే పరిస్థితి కేవలం తెలంగాణాలో మాత్రమే ఉందని, రైతుల అభివృద్దిలో బాగంగా విన్నూత్న నిర్ణయాలను తీసుకొంటు సాగు పై చర్చించుకొవడానికి, నిర్ణయాలు తీసుకొవడానికి నిలయాలుగా ప్రతి 5వేల ఎకరాలకు ఒక రైతువేధిక చోప్పున 71 క్లస్టర్ లలో రైతువేదికల నిర్మాణాలను ప్రారంభించుకొని దాదాపు పూర్తిచేసుకోవడం జరిగిందని పేర్కోన్నారు.

కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ కార్యక్రమాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి పెళ్లికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహయాన్ని అందిస్తున్న ఎకైన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఈరోజు కార్యక్రమం ద్వారా, 119 మంది లబ్దిదారులకు కోటి 19లక్షల 13వేల  రూపాయల కళ్యాణలక్ష్మి చేక్కులను అంధించడం జరుగుతుందని తెలియజేశారు.  


జిలాపరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత మాట్లాడుతూ, దేశంలోని రైతులకు, సామాన్య ప్రజల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, కాళేశ్వరం ప్రాజేక్టు వంటి బృహత్తర ప్రాజేక్టుల నిర్మాణాల ద్వారా భూమికి బరువనిపించే విధంగా పంటలు పండిస్తూన్న  రైతులకు అవగాహన కల్పిస్తూ,  పంటసాగులో  రైతుబగోగులను చర్చించుకోవడానికి వీలుగా రైతులవేధికల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, కళ్యాణ లక్ష్మీ, షాధిముబారక్ కార్యక్రమాల ద్వారా గరిబోళ్ల ఇళ్లలో జరిగే  పెళ్లిల కొసం లక్షా 16వేలు అందిస్తూ, సంతోషం అందిసూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా ఆర్థిక సహయాన్ని అందించడం వంటి బృహత్తర కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో కృషి చేసిన  రాష్ట్రముఖ్యమంత్రి గారికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.  


జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ,  జిల్లా వ్యాప్తంగా  71 క్టస్టర్ లను గుర్తించడంతో పాటు ప్రతి5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని నియమించి  రైతులకు అవగాహన కల్పిస్తూ, ఎ పంటను పండించాలని, ఎ పంటను పండించడం ద్వారా  లాబాలు  పొందుతామో తెలియజేసేలా రైతువేధికలన ఏర్పాటు చేసుకొని సకాలంలో ప్రారంభించుకోవడం జరుగుతుందని, రైతువేదికల ఒక  వ్యవసాధాకారి కార్యాలయం, రైతుబందు కో ఆర్డినేటర్  ప్రత్యేక గదులను ఏర్పాటు చేసుకోవడంతో పాటు సమావేశ మందిరాన్ని కూడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని,  సమావేశ మందిరలో  రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా పబ్లిక్ అడ్రస్ సిస్టం  ఏర్పాటు చేసుకోన్నది కేవలం జగిత్యాల జిల్లా మాత్రమేనని,  100 కూర్చీలు,  జైళ్లశాఖ ద్వారా 2 ఎగ్జిక్యూటివ్ కూర్చీలు, 8 ఎస్ టైప్ కూర్చీలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు,  పంటలను గురించి తెలుసుకోవడంతో పాటు మనం పండించే పంటలను గురించి చర్చించుకొనె విధంగా టివి మరియు ఇంటర్ నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కోన్నారు.

కళ్యాణ లక్ష్మీ, షాధిముబారక్ చెక్కులను మద్యవర్తుల ప్రమేయం ఎమాత్రం లేకుండా లబ్దిదారులకు అందించేలా చర్యలుచేపట్టడం జరిగిందని, ప్రజలకు ఏవైన ఇబ్బందులు కలిగినట్లయితే అధికారుల దృష్టికి తీసుకువచ్చి సుమస్యలను పరిష్కరించడం జరుగుతుందని పేర్కోన్నారు.  
ఈకార్యక్రమంలో గ్రామసర్పంచ్ శ్రీశాంత్ రెడ్డి, జట్పిటిసి జలందర్, యంపిపి శంకర్, టిఎస్ పిఎస్ చైర్మన్  రాజసుమన్ రావు,  మాదవరావు,  మార్కెట్ కమిటి చైర్మన్  లింగారెడ్డి,  మండల వైస్ చైర్మన్ ఆవుల సత్యం, రైతుసమన్వయ సమితి మండల  కో ఆర్డినేటర్  కిష్టారెడ్డి, మండల సర్పంచుల  ఫోరం అధ్యక్షులు రమేష్,  జిల్లా సర్పంచ్ల ఫోరం అద్యక్షులు గంగారెడ్డి ఇతర అధికారులు పాల్గోన్నారు.

Related Posts