YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భారత్ మాల ప్రాజెక్టు జగన్ కు వరం

భారత్ మాల ప్రాజెక్టు జగన్ కు వరం

విజయవాడ, ఏప్రిల్ 2, 
ఏపీ క‌ల‌ల రాజ‌ధానిగా ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో మీడియాలో, ట్రాఫిక్‌లో ఓ వెలుగు వెలిగిపోయింది అమ‌రావ‌తి. చంద్రబాబు ఐదేళ్ల పాటు కూడా అమ‌రావ‌తిని ప్రపంచ ప‌టంలో నిల‌బెడ‌తాన‌ని ప్రక‌ట‌న‌లు, గ్రాఫిక్స్ బొమ్మల‌తోనే కాల‌క్షేపం చేసేశారు. తాత్కాలికంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించి మ‌మః అనిపించేశారు. టీడీపీ పాల‌న‌లో అమ‌రావ‌తి ప్రక‌ట‌న‌ల మాయ‌లో మునిగిపోయింది. క‌ట్ చేస్తే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి మూడు రాజ‌ధానుల ప్రక‌ట‌న చేసిన వెంట‌నే అమ‌రావ‌తి మూగ‌బోయింది. అప్పటి వ‌ర‌కు ఉన్న అక్కడ నిర్మాణంలో ఉన్న ఆశాక హ‌ర్మ్యాలు ఆగిపోయాయి. అమ‌రావ‌తి పేరు త‌లుస్తోన్న వాళ్లే త‌క్కువైపోయారు. రియ‌ల్ రంగం ఢాం అంది. కేంద్రం నుంచి కూడా అమ‌రావ‌తి ఊసే లేదు.అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని చేస్తోన్న దీక్షలు 460 రోజులు దాటుతున్నా ప్రభుత్వానికి క‌నీసం చిన్న చీమ కుట్టిన‌ట్టుగా కూడా లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేంద్రం నుంచి అమ‌రావ‌తి విష‌యంలో ఓ గుడ్ న్యూస్ వ‌చ్చింది. అయితే ఈ సూప‌ర్ ఛాన్స్‌ను ఏపీ ప్రభుత్వం ఎంత‌వ‌ర‌కు స‌ద్వినియోగం చేసుకుంటుంది ? అన్నదే సందేహం. అమ‌రావ‌తి రింగ్ రోడ్‌కు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పటి వ‌ర‌కు అమ‌రావ‌తి విష‌యంలో చిన్న ప‌ని విష‌యంలో కూడా నాన్చుతూ నాన్చుతూ వ‌స్తోన్న కేంద్రం రింగ్ రోడ్ విష‌యంలో సుముఖంగా ఉండ‌డంతో పాటు కొన్ని కండీష‌న్లు పెట్టింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెపితే అమ‌రావ‌తికి క‌నీసం రింగ్ రోడ్ క‌ల అన్నా సాకారం అవుతుంది.జ‌గ‌న్ ప్రభుత్వం రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ చేసి మూడు రాజ‌ధానుల ప్రక‌ట‌న చేసినా కూడా అమ‌రావ‌తి అనేది శాస‌న రాజ‌ధాని అని చెప్పిన‌ప్పుడు అక్కడ క‌నీసం మౌలిక సౌక‌ర్యాలు అయినా క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. అమ‌రావ‌తి శాస‌న రాజ‌ధానిగా ఉంటే అక్కడ‌కు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు త‌ర‌చూ వ‌స్తూ ఉంటారు. ఐఏఎస్ అధికారులు సైతం అక్కడే ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడ క‌నీస మౌలిక సౌక‌ర్యాలు ఉండాలి. ఇక జ‌గ‌న్ ప్రభుత్వం అక్కడే మినీ హ‌బ్‌, ఎడ్యుకేష‌న్ హ‌బ్ కూడా ఏర్పాటు చేస్తాన‌ని ప్రక‌ట‌న చేసింది.ఈ క్రమంలోనే కేంద్రం భార‌త‌మాల ప్రాజెక్టులో భాగంగా రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇప్పటికే డీపీఆర్ ప‌రిశీల‌న చేయ‌డంతో పాటు ఇన్నర్‌, అవుట‌ర్ రింగ్ రోడ్డుకు ఓకే చెప్పింది. అయితే భూసేక‌ర‌ణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భ‌రిస్తే తాము రు. 60 నుంచి రు. 70 వేల కోట్లతో ఈ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామ‌న్న మెలిక కూడా పెట్టింది. జ‌గ‌న్ ప్రభుత్వం అమ‌రావ‌తి అనే దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేయ‌డం కంటే అంత‌కంటే దారుణం మ‌రొక‌టి ఉండ‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. మ‌రి ఈ ఛాన్స్‌ను జ‌గ‌న్ ప్రభుత్వం ఎంత వ‌ర‌కు యూజ్ చేసుకుంటుందో ?

Related Posts