ముంబై, ఏప్రిల్ 2,
ఈ ఏడాది ఒక మెటల్ రేట్లు చుక్కలంటుతున్నాయి. ఈ మెటల్ బంగారం కంటే మూడు రెట్లు విలువైంది. బిట్కాయిన్తోపాటు, కొన్ని ఇతర మెటల్స్తోనూ రేట్ల విషయంలో పోటీపడుతోంది ఈ మెటల్. కాకపోతే, ఈ మెటల్ కొనడం ఇన్వెస్టర్లకు మాత్రం పెద్ద సవాలుగానే నిలుస్తోంది. ఎక్కువ విలువుండే ఆ మెటల్ ఇరిడియం. ప్లాటినమ్, పలాడియమ్ మైనింగ్లో బై ప్రొడక్ట్గా ఈ ఇరిడియం మెటల్ దొరుకుతుంది. 2021 జనవరి నుంచి ఇప్పటిదాకా ఇరిడియం రేటు 131 శాతం పెరిగింది. ఇదే కాలంలో బిట్ కాయిన్ 85 శాతమే ఎగిసింది. గత ఏడాది కాలంలో సప్లయ్లో సమస్యలు రావడంతోపాటు, డిమాండ్ భారీగా పెరగడంతో రేట్లు ఊపందుకున్నట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ స్క్రీన్స్ తయారీలో ఎక్కువగా వాడటం వల్లే డిమాండ్ పెరిగినట్లు రిఫైనింగ్ కంపెనీ హెరాస్ గ్రూప్ వెల్లడించింది. మిగిలిన మెటల్స్తో పోలిస్తే ఇరిడియం మార్కెట్ చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఈ మెటల్ ప్రొడక్షన్లో ఏ చిన్న సమస్య తలెత్తినా రేట్లపై పెద్ద ప్రభావమే కనిపిస్తుంది. ఇండస్ట్రియల్ యూజర్లే వాడుతుండటం వల్ల డిమాండ్ను అంచనా వేసి, ఇరిడియం కొనుగోలు, అమ్మకాలు జరపడం కొంచం కష్టమైన పనేనని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఏ ఎక్స్చేంజ్లోనూ లేదా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోనూ ఇరిడియం ట్రేడవడం లేదు. కొంత మంది డీలర్ల దగ్గర మాత్రమే దొరికే ఇన్గాట్స్ను రిటెయిల్ బయ్యర్లు కొనగలుగుతున్నారు. ఇక పెద్ద ఇన్వెస్టర్లైతే మాత్రం నేరుగా ప్రొడ్యూసర్ల వద్దకే చేరుతున్నాజాన్సన్ మాథే పీఎల్సీ డేటా ప్రకారం ఇరిడియం రేటు ఔన్సుకు 6 వేల డాలర్ల దాకా ఉంది. స్పార్క్ ప్లగ్స్ తయారీలో కూడా దీనిని ఎక్కువగానే వాడుతున్నారు. అంటే, ఈ రేటు ప్రకారం బంగారం కంటే ఇరిడియం విలువ మూడు రెట్లు ఎక్కువన్న మాట. ప్లాటినం ప్రొడక్షన్ కోసం ఎక్కువగా పెట్టుబడులు పెట్టకపోవడం వల్లే ఇరిడియం అట్రాక్టివ్గా మారుతోంది. ప్లాటినం మెటల్స్ను ఆటోకేటలిస్ట్స్గాను, ఎమిషన్స్ తగ్గించడానికీ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ జోరందుకోవడంతో హైడ్రోజన్ టెక్నాలజీస్పై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చూస్తున్నారు. సప్లయ్ లిమిటెడ్గా ఉండటంతో ప్లాటినం గ్రూప్ మెటల్స్ రేట్లు పెరగడానికి వీలు కలుగుతోంది. పలాడియం రేటు ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది. రోడియం రేటైతే ఈ వారం రికార్డు లెవెల్లో ఔన్సు 29,800 డాలర్లకు చేరింది. రుథినియమ్ కూడా 13 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.