YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సోషల్ మీడియాతో ఒత్తిడి ఎక్కువే

 సోషల్ మీడియాతో ఒత్తిడి ఎక్కువే

4జీ, ఆండ్రాయిడ్ ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైంది. ఫేస్బుక్, లైక్స్, షేర్స్, కామెంట్స్ ఇవి నిత్యం యువత పఠిస్తున్న మంత్రాలు. యువతీ యువకులు గంటల తరబడి సోషల్ మీడియాలో గడుపుతుండటంతో అనేక మానసిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫేస్బుక్కి దూరంగా ఉంటే ఒత్తిడిని తగ్గతుందని తాజాగా ఆస్ట్రేలియాలో ఒక రీసెర్చ్ తేల్చింది.రోజురోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీ .. సోషల్ మీడియాతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. పట్నం.. పల్లె తేడా లేదు.. పదిహేనేళ్ల పిల్లాడి నుంచి పండు ముసలి దాకా అందరి చేతుల్లో సెల్ఫోన్ హల్చల్ చేస్తోంది.  సోషల్మీడియా రాకతో కుర్రకారు తీరే పూర్తిగా మారింది. లేచినది మొదలు, పడుకునేదాకా ప్రతి పనిని ఫేస్బుక్లో అప్డేట్ చేస్తున్నారు. గుడ్మార్నింగ్లు చెప్పుకోవడం, ఛాట్ చేయడం, ఎక్కడకి వెళ్లినా సెల్పీలు తీసుకొని అప్లోడ్ చెయ్యడం, ప్రెండ్ రిక్వెస్ట్లు పెట్టడం, కొత్త వస్తువులు ఏది కొన్నా వాటిని పేస్బుక్లో పెట్టి కమెంట్స్ అడగడం, లవ్ చేయడం ఇలా అన్నీ ఫేస్బుక్లోనే. కేవలం లైక్ల కోసమే పోస్టింగ్లు చేయడం, అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయినా, తమను స్నేహితులుగా అంగీకరించక పోయిన మానసికంగా కుంగిపోవడం ఇది నేటి యూత్ దుస్థితి.ప్రతీ మనిషి రోజులో కనీసం అర గంట నుంచి ఆరు గంటలపాటు సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. కొంబెం బోర్ కొడితే చాలు సెల్ఫోన్ బయటకు తీసి ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సప్లో గంటలు గడిపేస్తున్నారు. జియో రాకతో నెట్వర్క్ కంపెనీల మద్య పోటీతో కాల్, డేటా రేట్లు తగ్గడంతో ఇంటర్నెట్ వాడకం మరింత పెరిగింది. చిన్నపిల్లలు సైతం వీడియోగేమ్స్ కోసం ఇంటర్నెట్ని వదలడంలేదు. క్యాండీక్రస్ గేమ్ ఇటీవల కాలంలో చాలా పాపులర్ అయ్యింది. రిక్వెస్ట్ లు, లాక్లు, స్టేజీలు ఇలా దీన్ని ఆడటం కోసం పిల్లలు కూడా ఎక్కువగా ఫేక్బుక్నే వాడుతున్నారు. యూత్లో పేక్బుక్కి ఒక్క ప్రత్యేక స్థానం ఉంది. కొత్త వారి పరిచయాల కోసం, సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ వర్క్ గ్రూప్ వాళ్లతో ఇంటరాక్ట్ కోసం పేస్బుక్ని ఎక్కువగా వాడుతున్నారు.నిరంతంర పేస్బుక్ని చూస్తూ, చాట్ చేస్తూ యువత, ఉద్యోగులు ఎప్పడు నిద్రపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మెలకువగా ఉండేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీనివలన నిద్రలేమి, ఎసిడిటీ, అనవసరంగా ఆందోళన పడటం, మధుమేహం, రక్తహీనత వంటి అనేక శారీరక, మానసిక సమస్యల బారిన పడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని కొందరు పరిశోధకులు పేస్బుక్కి దూరంగా ఉండటం వల్ల ఒత్తిడి మాయం అవుతుందని చెప్పారు. వీరు సుమారు 136 మంది మీద రీసెర్చ్ చేశారు. వారిని ఐదు రోజులపాటు పేస్బుక్కి దూరంగా ఉంచారు. రీసెర్చ్ కి ముందు వారిలోని ఒత్తిడిని, రీసెర్చ్ తర్వాత ఒత్తిడినీ పరిశీలించగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పరిశోధనకి ముందు వారిలో ఒత్తిడిని కలిగించే కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవ్వగా, రీసెర్చ్ తరువాత ఈ హార్మోన్ తక్కువ విడుదల కావడాన్ని గుర్తించారు.ఫేస్బుక్ ఉపయోగించడం తప్పుకాదు. కానీ దాన్ని యూత్ ఉపయోగిస్తున్న తీరే ఆందోళనకు గురిచేస్తుంది. రోజులో కొంచెంసేపైతే పర్లేదుకానీ.. అదే వ్యసనమైతే మాత్రం సమస్యలు కొనితెచ్చుకున్నట్లే. పేస్బుక్లో కొత్తవారితో అనవసర పరిచయాలు, లేనిపోని సమస్యలు, ఒత్తిడి వీటన్నింటి వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవాలంటే పేస్బుక్కి దూరంగా ఉండడమేలని తాజాగా ఆస్ట్రేలియాలోని జరిగిన అధ్యయనం సూచిస్తుంది

Related Posts