అమరావతి ఏప్రిల్ 2,
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన నేపధ్యంలో వివిధ జిల్లాలో అవగాహన ర్యాలీలు అధికారులు నిర్వహిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించండి. భౌతిక దూరం పాటించండని ప్రజలకు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో వార్డు స్థాయి నుంచి అవగాహన కార్య క్రమాలు కొనసాగుతున్నాయి.కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై తెనాలిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహిళలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ప్రజలందరూ బతుకు దూరం పాటించాలని,ముఖానికి మాస్క్ లను ధరించి కరోనా వైరస్ నుండి రక్షణ పొందాలని కోరారు.
మరోవైపు, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోం ది.12 కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 149 కు చేరింది. తాజా కేసులను పరిశీలిస్తే ఏలూరులో 5, కొవ్వూరు, చింతలపూడి మండలం రాఘవాపురంలో 2 చొప్పున, పెదపా డు, పెరవలి, పెనుమంట్ర, ఇరగవరం, తణుకు, ఆకివీడు గ్రామాల్లో ఒక్కొ క్కటి చొప్పున నమోదయ్యాయి.దింతో జనసంద్రంగా ఉన్న ప్రాంతాల్లో అధికా రులు చర్యలు చేపట్టారు.ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణిస్తున్న వారు కోవిడ్ నిబంధనలు పాటించేలా సూచనలు చేశారు.