గుంటూరు ఏప్రిల్ 2,
ఎక్కడా దొరకని తొలితరం సింధటింగ్ డ్రక్స్ గుంటూరు మంగళ గిరిలో కలకలం రేపింది.విద్యార్థులే టార్గెట్ గా వీటిని విక్రయాలు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాలను విద్యార్థులకు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను మంగళగిరి ఎస్ఈబీ అధికారులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్ 1.065 గ్రాములు, వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అసిస్టెంట్ కమిషనరు చంద్రశేఖరరెడ్డి మాట్లా డుతూ హాస్టల్ నిర్వాహకుడు కందుల శ్రీకాంత్రెడ్డి తాడేపల్లి మండలం వడ్డేశ్వరం, ఇప్పటం గ్రామాల్లో విద్యార్థులకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నాడు.ఇందుకోసం మధ్య వర్తులుగా నూర్బాషా దర్గావలి, హరీష్ను వినియోగించుకున్నాడు. మంగళగిరి ఎస్ఈబీ అధికారులు నూర్బాషాదర్గావలి, మక్కెన మణికంఠ అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.కందుల శ్రీకాంత్రెడ్డి, హరీష్లను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.