ఎమ్మిగనూరు ఏప్రిల్ 2,
పట్టణంలో గల మానసిక దివ్యంగులకు సంబంధించిన భవిత స్కూల్లో బాబు ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజులు ఆటలు, పోటీలు అలాగే పాటలతో సంబరాలు జరుపుకున్నారు.. ఈ కార్యక్రమనికి ముఖ్య అథితులుగా డా. మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు పాల్గొనటం జరిగింది. ఈ సంధర్బంగా డా. మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ ముందుగా అందరికీ ప్రపంచ ఆటిజం దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేయటం జరిగింది.అలాగే ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకుబహుమతులు మరియు పేద దివ్యంగులకు బట్టలు పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, భవిత స్కూల్లో మౌలిక సదుపాయాలకు సంబందించి, ఇంత వరకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాను. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం స్కూలుకు మంచి వాతావరణం గల స్థలాన్ని కేటాయిస్తే మంచి బిల్డింగ్ ను నిర్మించి ఇస్తాను అని తెలియ జేయటం జరిగింది. ఎల్లప్పుడూ ఈ స్కూల్ కు నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని తెలియ జేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ బాబు, విజయ లక్మి, ఆయా విజయ,అలాగే మల్లెల గ్రూప్స్ సభ్యులు రవి,ముత్తు,రాజు, సతీష్, సామేలు, మార్టిన్ మొదలగు వారు పాల్గొన్నారు..