YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గ్రామస్థాయి నుండి ధర్మప్రచారానికి ప్రణాళికలు టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి

గ్రామస్థాయి నుండి ధర్మప్రచారానికి ప్రణాళికలు టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి

తిరుమల,  ఏప్రిల్ 2  
గ్రామస్థాయి నుండి సనాతన హిందూ ధర్మప్రచారాన్ని విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందుకోసం భజనమండళ్లు, గోశాల నిర్వాహకులు, విష్ణుసహస్రనామ, లలితాసహస్రనామ మండళ్లు, శ్రీవారి సేవకుల వివరాలు సేకరిస్తున్నామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ముందుగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కోవిడ్ నిబంధనలు పాటించాలి :
కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నందున శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలి. సమయానుసారం శానిటైజర్ వినియోగించాలి. మాస్కులు లేని భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద మాస్కులు అందించే ఏర్పాటు చేస్తాం.
బస :
ఆన్లైన్లో గదులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులు మొదట సిఆర్వో కార్యాలయానికి వెళ్లి అక్కడినుండి సబ్ ఎంక్వైరీ కార్యాలయానికి చేరుకుని గదులు పొందుతున్నారు. యాత్రికులు తిరుపతిలో అలిపిరి చెక్పాయింట్ దాటగానే ఎస్ఎంఎస్ ద్వారా సబ్ ఎంక్వైరీ కార్యాలయం వివరాలు తెలియజేస్తాం. తద్వారా యాత్రికులు నేరుగా సబ్ ఎంక్వైరీ కార్యాలయానికి వెళ్లి గదులు పొందే సౌలభ్యం కల్పిస్తాం. రానున్న 10 రోజుల్లో ఈ విధానం అమల్లోకి రానుంది.
ఆన్లైన్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అదే స్క్రీన్లోనే గదులు బుక్ చేసుకునేందుకు వీలుగా టిటిడి వెబ్సైట్లో మార్పు చేస్తున్నాం.
కాల్ సెంటర్ :
కాల్ సెంటర్ను పటిష్టం చేసి యాత్రికులకు వేగవంతంగా సమాచారం అందించే ఏర్పాట్లు చేపట్టాం. ఇందుకోసం సిబ్బంది సంఖ్యను 8 నుండి 15 మందికి పెంచాం. కాల్ సెంటర్ టోల్ఫ్రీ నంబరులో అంకెలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
 

Related Posts